English   

బన్నీ వాస్ వివాదం మీద క్లారిటీ...ఇంకా కావాలంటే వారిని కలవాలట

bunny
2019-09-06 05:13:09

నిర్మాత బన్నీ వాసు తనకు సినిమాలో అవకాశాలు ఇస్తానని నమ్మించి మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత అనే ఆమె ఫిలిం ఛాంబర్ ఎదుట గొలుసులతో బందించుకుని మరీ నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే. ఆమెని పోలీసులు అరెస్ట్ చేసి సునీతకి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. అయితే ఈ అంశం మీద రకరకాల ప్రచారాలు జరిగాయి. దీనిపై గీతా ఆర్ట్స్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. సునీత పేరు కూడా ప్రస్తావించకుండా జరుగుతున్న వివాదం గురించి క్లారిటీ ఇచ్చారు. 'గత కొన్ని రోజులుగా గీతా ఆర్ట్స్ సంస్థ ఓ మహిళ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంతోందని, తమ సినిమాల్లో క్యారెక్టర్ ఇమ్మని డిమాండ్ తో గీతా ఆర్ట్స్ ఆఫీస్ గేటు వద్ద, షూటింగ్ లొకేషన్స్ కి వచ్చి హద్దు మీరి ప్రవర్తిస్తోందని పేర్కొంది.  

దీనిపై తాము గతంలో పోలీస్ కేసు నమోదు చేశామని ఫిలిం ఛాంబర్ లో కూడా ఫిర్యాదు చేశామని ఆ ప్రకటనలో పేర్కొంది. తాము ఎదుర్కొంటున్న సమస్యని పూర్తిగా అవగతం చేసుకోకుండా మీడియా సంస్థలు తప్పుదోవ పట్టిస్తూ వార్తలు ప్రచురించాయని పేర్కొంది. ఈ వివాదంపై పూర్తి క్లారిటీ కావాలనుకునే వారు గీతా ఆర్ట్స్ సంస్థని, ఫిలిం ఛాంబర్ ని సంప్రదించవచ్చు అని గీతా ఆర్ట్స్ ప్రకటన విడుదల చేసింది. జనసేన పార్టీకి పనిచేస్తే గీతా ఆర్ట్స్‌లో అవకాశాలు ఇస్తామన్నారని అందుకే తన సొంత ఖర్చులతో జనసేన పార్టీకి పనిచేశానని, తీరా ఎన్నికలు ముగిసిన తరువాత బన్నీ వాసుని కలవడానికి కూడా ఇష్టపడడం లేదని పేర్కొంటూ తనను తాను బంధించుకున్నారు సునీత. దీనిపై గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది ఆమె

More Related Stories