English   

మీకు మాత్రమే చెప్తా టీజర్ విడుదలయ్యేది ఎప్పుడో తెలుసా..?

mmcp
2019-09-06 20:00:14

విజయ్ దేవరకొండ హీరోగా తెలుసు కానీ నిర్మాతగా ఎలా ఉంటాడో తెలియదు. ఇప్పుడు అది కూడా చూపించడానికి వచ్చేస్తున్నాడు ఈ హీరో. ఈయన నిర్మిస్తున్న తొలి సినిమా మీకు మాత్రమే చెప్తా టీజర్ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఏ సందడి లేకుండా ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. కొత్త దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో తనకు హీరోగా నిలబెట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ఇప్పుడు ఈ సినిమాతో తను పూర్తి స్థాయి లీడ్ హీరోగా మార్చేసాడు విజయ్. షూటింగ్ కూడా పూర్తి కావడంతో టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియో సినిమాపై ఆసక్తి పెంచేసింది. సెప్టెంబర్ 7 సాయంత్రం 6 గంటల 2 నిముషాలకు మీకు మాత్రమే చెప్తా టీజర్ రానుంది. ఇది వచ్చిన తర్వాత అంతా తమ సినిమా గురించి అందరికీ చెప్తారంటున్నాడు విజయ్ దేవరకొండ. తన డబ్బులు మొత్తం ఈ సినిమాపైనే పెడుతున్నాడు విజయ్. ఇదే విషయాన్ని చెప్పాడు కూడా. అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

More Related Stories