English   

ఇస్మార్ట్ సక్సెస్ క్యాష్ చేసుకోలేకపోతున్న నిధి అగర్వాల్..

nidhi
2019-09-07 06:52:49

బాలీవుడ్ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. బెంగళూర్ నుంచి వచ్చిన ఈ భామ.. సవ్య‌సాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. అక్కినేని వారసుల సాయంతో తెలుగు ఇండస్ట్రీలోకి అయితే బాగానే వచ్చింది కానీ హిట్ కోసం మాత్రం చాలా కష్టాలే పడింది. ఎలాగైనా తెలుగు ఇండస్ట్రీలో నిలబడిపోవాలని చూస్తుంది ఈ భామ‌. అయితే ఊహించని విధంగా స‌వ్య‌సాచి డిజాస్టర్ కావడంతో నిధి అగర్వాల్ ఆశ‌ల‌న్నీ గ‌ల్లంతైపోయాయి. అన్నయ్య షాకిచ్చినా కూడా తమ్ముడు అఖిల్ మిస్టర్ మజ్నులో నటించాడు. కానీ ఇది కూడా డిజాస్టరే అయింది. ఎలాగోలా చివరికి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అయితే అందుకుంది కానీ ఇప్పుడు ఈ చిత్రం వచ్చిన తర్వాత కూడా నిధికి అవకాశాలు రావడం లేదు. ప్రతీ సినిమాలోనూ అందాల ఆరబోత ఓ రేంజ్ లో చేసిన తర్వాత కూడా ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు నిధిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికిప్పుడు ఏదైనా అద్భుతం జరిగి స్టార్ హీరోలు అవకాశం ఇస్తే తప్ప నిధి పరిస్థితి గల్లంతే. గ్లామర్ షో విష‌యంలో ఎలాంటి అడ్డూ అదుపూ లేని ఈ ముద్దుగుమ్మ అడిగిందే తడువుగా అన్ని చూపించేస్తుంది. మరి ఈమె కోరుకున్న స్టార్ ఇమేజ్ ఎప్పటికి వస్తుందో చూడాలి.

More Related Stories