బన్నీ, సుకుమార్ సినిమా ఆరోజు నుండే

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. నిజానికి మహేష్ తో చేయాల్సి ఉన్న కథతో సుకుమార్ అల్లు అర్జున్ తో చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే నిజానిజాలు ఏమిటో కానీ స్క్రిప్ట్ అదో కాదో కానీ సినిమా అయితే ఓకే అయ్యింది. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ లో ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించనుందని చెబుతున్నారు. అయితే ముందు అనుకున్నట్టుగానే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీదనే ఈ సినిమాని నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్ నిర్మించనున్నారు.
ఇక మంచి ముహూర్తం చూసుకుని సినిమాని ప్రారంభించడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్ 3న పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలనుకుంటున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కాకినాడ షెడ్యూల్లో పాల్గొంటున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా పూర్తి అయినా కాకున్నా ప్యారలల్ గా సుకుమార్ సినిమా కూడా మొదలు పెట్టేస్తారని అంటున్నారు. ఇక అక్టోబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగు కూడా మొదలు పెడతారని అంటున్నారు. చూడాలి మరి ఎంతవరకూ ఈ ప్రచారం మేరకు సినిమా మొదలవుతుందో ఏమో.