English   

అనుష్క నిశ్శబ్దం వీడేది అప్పుడే

Anushka.jpg
2019-09-07 17:54:10

 ‘భాగమతి’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క నటిస్తున్న సినిమా సైలెన్స్. ఈ సినిమాని  తెలుగు, త‌మిళ, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఒకేసారి విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది మేలో మొదలయిన ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. అందుకే ఈ సినిమాని డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి అనుష్క లుక్ ఈ నెల పదకొండున రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది సినిమా యూనిట్. ఇక ఈ సినిమా కధ దృష్ట్యా షూట్ సింహ భాగం అమెరికాలో జరుపుకుంది.

 అనుష్కతో పాటు మాధవన్‌, మైఖేల్‌ మ్యాడ్‌సన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కోన వెంకట్‌, టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థ్రిల్లర్‌ జోనర్‌లో సాగే ఈ చిత్రానికి మిగిలిన భాషల్లో ‘సైలెన్స్‌’ అనే టైటిల్‌ను నిర్ణయించగా తెలుగులో నిశ్శబ్దం పేరుతో రిలీజ్ కానుంది.  ఇక ‘నిశ్శబ్దం’లో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నా దాని మీద మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు.

More Related Stories