English   

సాహో డైరెక్టర్ కి అనారోగ్యం...

saaho-Director-Sujith.jpg
2019-09-07 21:07:43

సాహో సినిమా భారీ అంచనాలతో రిలీజయ్యింది. అంచనాలకు తగ్గట్టే ఈ సినిమాకు మొదటి రోజున అన్ని భాషల్లో మంచి కలెక్షన్స్ సాధించింది. మొత్తంగా ఈ సినిమాలో ఏడు రోజులకు అన్ని భాషల్లో కలిపి రూ.370 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. 

ఈసినిమా ప్రెంచ్ మూవీ లార్గోవించ్ నుండి కాపీ కొట్టి తీశాడంటూ సుజీత్‌పై సంచలన ఆరోపణలు మొదలయ్యాయి. తన సినిమాపై ఇలాంటి కమెంట్స్ రావడంతో తాజాగా ఇన్స్టా గ్రామ్ లో స్పందించాడు సుజీత్. సాహో సినిమాని లార్గోవించ్ నుండి కాపీ కొట్టి తీశానని చాలా మంది నాపై ఆరోపణలు చేస్తున్నారు కదా.. అలాంటి వాళ్లంతా నిజంగా లార్గోవించ్ సినిమాను మాత్రం కచ్చితంగా చూసుండరని కామెంట్ చేసాడు సుజిత్. తాను ఆరేళ్ల కింద చేసిన రన్ రాజా రన్ సినిమాని కాస్త మార్చి సాహో సినిమా తీశానని చెప్పాడు సుజీత్. అయితే ఆయన మీడియా ముందు కనపడక పోవడంతో ఈ సినిమా రిజల్ట్ దెబ్బకు భయపడ్డాడని సుజీత్ గోవా వెళ్లిపోయారంటూ ప్రచారం జరిగింది. 

అందుతున్న సమాచారం ప్రకారం సుజీత్ డెంగ్యూ జ్వరం బారిన పడ్డారట. ఆ దెబ్బకి నీరసంతో బాధపడుతోన్న సుజీత్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారట. సుజీత్ రక్తంలో ప్లేట్‌లెట్లు బాగా తగ్గిపోవడంతో ఆయనకు పూర్తిగా విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. నిజానికి ఈ సినిమా షూటింగ్ లో కూడా హీరోయిన్ శ్రద్దా కూడా డెంగ్యూ బారిన పడింది. ఆమె కోలుకుని షూట్ లో పాల్గొంది.

More Related Stories