English   

తమిళనాడు క్వీన్ గా మారిన శివగామి

first-look-Jayalalitha.jpg
2019-09-08 07:52:24

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అలనాటి స్టార్ హీరోయిన్ జయలలిత జీవిత కథతో ఇప్పటికే వరుసగా బయోపిక్ లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జయ పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్న ఓ సినిమా సెట్స్ పై ఉండగా, కంగనా రనౌత్ మరో సినిమా చేస్తోంది. ఇక శశికళ బయోపిక్ పేరుతో వర్మ కూడా ఒక సినిమా అనౌన్స్ చేశాడు. మరోపక్క గౌతమ్ మీనన్ దర్శకత్వంలో జయ లలిత బయోపిక్ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. అయితే ఇందులో జయ పాత్రకోసం ముందుగా మలయాళీ ముద్దుగుమ్మ మాంజిమ మోహన్ ని సంప్రదించారట. ఆమె కళ్లు.. ముఖ కవలికలు అచ్చం అమ్మనే పోలి ఉంటాయని కానీ అప్పటికే మూడు సినిమాలతో బిజీగా ఉండడం వల్ల మూడు నెలల కాల్షీట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ ఆఫర్ ని కాదనుకోవాల్సి వచ్చిందని మాంజిమ ఆ తర్వాత చెప్పుకొచ్చింది.

మంజిమవ వదులుకున్న పాత్రలో రమ్యకృష్ణ నటించారు. దాదాపు షూట్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఎమెక్స్ ప్లేయర్ యాప్ లో రిలీజ్ కానుంది. క్వీన్ పేరుతో తెరకక్కిన ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన మొదటి లుక్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ ఓ వర్గం ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే జయలలిత సినిమా కెరీర్ కి సంబందించిన కాంట్రవర్సీ విషయాలను ఈ వెబ్ సిరీస్ లో పెద్దగా టచ్ చేయ కుండా కేవలం ఆమె పొలిటికల్ కెరీర్ గురించి మాత్రమే చూపించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన షూటింగ్ త్వరగా పూర్తిచేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

More Related Stories