English   

ఆ డైరెక్టర్ కి రామ్ ఓకే చెప్పాడా

ram pothineni
2019-09-08 14:52:33

చానళ్ళగా హిట్ లేని డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది.  అంతగా ఫామ్‌లో లేని రామ్‌ తో అసేలేమాత్రం ఫామ్ లో లేని పూరీ ఇస్మార్ట్ శంకర్ తీసి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత పూరీ జగన్నాధ్ విజయ్ దేవరకొండతో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అయితే ప్రకటించారు కానీ సినిమా గురించి మరే ఇతర వివరాలు ప్రకటించలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ హీరోగా పూరి తన సొంత బ్యానర్ మీదే సినిమా తీయబోతున్నాడు. ఇక రామ్ కూడా తన తర్వాతి సినిమా లైన్ లో పెట్టాడని అంటున్నారు. టాలీవుడ్ లో మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వివివినాయక్ తో రామ్ సినిమా చేయనున్నారని అంటున్నారు. నిజానికి వినాయక్ కి కొంత కాలంగా పెద్దగా కలిసి రావడం లేదు. 

అయితే మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన 150 మూవీ 'ఖైదీ నెంబర్ 150' బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత తీసిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో వివినాయక్ తో సినిమాలు తీయడానికి నిర్మాతలు సహా హీరోలు కూడా జంకుతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ వచ్చింది. అప్పటి నుంచి ఈ దర్శకుడి సినిమాలు ఏవీ రాలేదు. ఈ మద్య వివివినాయక్ హీరోగా నటిస్తున్న సినిమా కూడా మొదలయింది. అయితే అప్పట్లో బాలయ్యకి ఒక కధ చెప్పడం అది ఓకే అవ్వడం కూడా జరగడంతో ఆ సినిమా ఒకటి బాకీ ఉంది. రామ్ కూడా ఇప్పుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయవలసి వుంది. అయితే ఆ సినిమాకి టైం పట్టచ్చని అంటున్నారు. ఈ క్రమంలో వినాయక్ తో సినిమా కానిచ్చేయాలని భావిస్తున్నట్టు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. చూడాలి మరి ఇందులో నిజం ఎంతుందో ? 

More Related Stories