అల్లు అర్జున్ బాకీ సుకుమార్ తీరుస్తాడా లేదా..

సుకుమార్.. ఈయన ఓ భిన్నమైన దర్శకుడు. అందర్లాంటి సినిమాలు చేయడం ఈయనకు ఎందుకో ఇష్టం ఉండదు. హాలీవుడ్ రేంజ్ కు తెలుగు సినిమాను తీసుకెళ్దామనుకుంటాడు.. కానీ మన ప్రేక్షకులే అక్కడికి రారు. అందుకే సుకుమార్ సినిమాలు పెద్దగా ఆడవు. ఎప్పుడూ అర్థం కాని కథలను తీసుకుని ప్రయోగాలు చేయడం ఈ దర్శకుడి అలవాటు. మహేశ్ నేనొక్కడినే.. రామ్ జగడం.. నాన్నకు ప్రేమతో.. ఇలా బాగా టిపికల్ గా ఆలోచిస్తుంటాడు ఈ దర్శకుడు. కానీ కెరీర్ లో ఫస్ట్ టైమ్ ప్రేక్షకుల కోసం ఆలోచించి చేసిన సినిమా రంగస్థలం. అలా చేసిన తొలి సినిమానే ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది. రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం 125 కోట్లకు పైగా షేర్.. 200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రంగస్థలం తర్వాత మహేష్ బాబుతో సినిమా అనుకున్నా కూడా అది వర్కవుట్ కాలేదు. దాంతో ఇప్పుడు బన్నీ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. కచ్చితంగా బన్నీతో తన బాకీ తీర్చేస్తానంటున్నాడు ఈక్ష్న. ఈయన ఎప్పుడూ స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తుంటాడు. ఎందుకంటే నేనొక్కడినే లాంటి ఫ్లాప్ తర్వాత కూడా ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో పట్టేసాడు సుక్కు. ఇక ఆ సినిమా యావరేజ్ గా ఆడినా రంగస్థలం అవకాశం అందుకున్నాడు. ఇప్పుడు రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ సినిమా కాదని మరీ బన్నీతో సినిమా చేయబోతున్నాడు ఈయన. ఈ కాంబినేషన్ లో ఇప్పటికే ఆర్య.. ఆర్య 2 సినిమాలు వచ్చాయి. ఇందులో ఆర్య ట్రెండ్ సెట్టర్ అయితే.. ఆర్య 2 డిజాస్టర్. మరి మూడోసారి ఎలాంటి సినిమాతో రానున్నాడో చూడాలిక.