హెబ్బా పటేల్ కు అప్పుడే ఎన్ని కష్టాలు వచ్చాయో పాపం..

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మెరుపుతీగల్లా కనిపిస్తారు. ఆ తర్వాత ఇండస్ట్రీ నీళ్లు బాగా ఒంటబట్టి బొద్దుగా మారిపోతుంటారు. కొందరు హీరోయిన్లు చూడ్డానికి బొద్దుగా ఉన్నా బాగానే ఉంటారు. కానీ కొందరు మాత్రం బొద్దుగా ఉంటే అస్సలు చూడలేం. హెబ్బా పటేల్ ఇప్పుడు ఇలాగా తయారైంది. కుమారి సినిమాలో కాస్త సన్నగా కనిపించిన ఈ భామ.. ఇప్పుడు బాగా ఒళ్ళు చేసింది. కెరీర్ మొదట్నుంచీ ఈ భామ సన్నగా మాత్రం లేదు. కానీ మరీ చూడ్డానికి ఎబ్బెట్టుగా కూడా లేదు. కానీ ఇప్పుడు ఆ రూపంలోకి వచ్చేస్తుంది. హీరోయిన్ అన్న తర్వాత అవకాశాల కోసం ఎంత వేచి చూస్తారో.. ఫిజిక్ మీద కూడా అంతే దృష్టి పెడతారు. ఒక్కసారి బాడీపై కంట్రోల్ పోయిందంటే ఇక వాళ్లను చూడటం కష్టం. గతంలో ఆర్తిఅగర్వాల్, నమిత లాంటి హీరోయిన్లు చూస్తుండగానే లావుగా మారిపోయి కెరీర్ నాశనం చేసుకున్నారు. ఇప్పుడు హెబ్బాపటేల్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. దానికితోడు కొన్నేళ్లుగా ఈమెకు సరైన విజయాలు లేవు. దాంతో ఇప్పుడు విలన్ అవుతుంది హెబ్బా. నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న భీష్మ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుంది హెబ్బా పటేల్. ఇందులో అమ్మాయిలు అంటే పారిపోయే పాత్రలో నటిస్తున్నాడు నితిన్. రష్మిక మందన్న హీరోయిన్. ఇందులో హెబ్బా ప్రతినాయక పాత్రలో నటిస్తుండటంతో ఆసక్తి కూడా పెరిగిపోతుంది. మరి కెరీర్ ను కాపాడుకోడానికి చివరికి విలన్ గా కూడా నటించేస్తుంది ఈ బ్యూటీ. మరి ఆమెకు భీష్మ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.