English   

విజయ్ సినిమాకు నో చెప్పిన రష్మిక మందన్న.. ఫ్యాన్స్ షాక్.. 

Rashmika Mandanna
2019-09-08 16:34:33

ఛలో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి దూసుకొచ్చిన ముద్దుగుమ్మ ర‌ష్మిక మంద‌న్న‌. ఆ సినిమా త‌ర్వాత అమ్మ‌డుకు సూప‌ర్ క్రేజ్ వ‌చ్చింది. ఇక ఛ‌లో త‌ర్వాత గీత గోవిందం కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో ర‌ష్మిక ఇమేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. దాంతో ఇప్పుడు ఈమె పారితోషికం కూడా అలాగే పెరిగిపోయింది. మ‌ధ్య‌లో వ‌చ్చిన దేవ‌దాస్ ఫ్లాప్ అయినా కూడా మొన్న విజ‌య్ దేవ‌ర‌కొండతో డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఫ్లాప్ అయినా తర్వాత కూడా రష్మికకు ఆఫర్లు తగ్గడం లేదు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరుతో పాటు నితిన్ భీష్మ సినిమాల్లో నటిస్తుంది రష్మిక. అయితే తమిళనాట విజయ్ సినిమాలో నటించే ఆఫర్ వదిలేసుకుందనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బిగిల్ సినిమాలో నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సై అన్నాడు. ఈ సినిమాలో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే బాలీవుడ్ సినిమా కోసం ఇప్పుడు రష్మిక ఈ ఆఫర్ వదిలేసుకుందనే ప్రచారం తమిళనాట జరుగుతుంది. దానికితోడు బాలీవుడ్ సినిమాకు రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. దీనిపై ఓపెన్ అయింది కూడా. ఏంటి మేడ‌మ్ పారితోషికం బాగా పెంచేసార‌ట క‌దా అంటూ మీడియా మిత్రులు అడిగితే ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. ఇన్నేళ్ల కెరీర్ లో ఎదుగుతున్న‌పుడు పారితోషికం పెంచడం కూడా సాధారణమైన విషయమే. ఎంత పెరిగితే త‌న ఎదుగుద‌ల కూడా అంతే ఉన్న‌ట్లు అని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. మొద‌ట్లో ఒక్కో సినిమాకు 40 ల‌క్ష‌లు తీసుకునే ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా కోటి దాటేసింది. అయితే క‌న్న‌డ‌లో మాత్రం ఇప్ప‌టికీ త‌క్కువే తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. అక్క‌డ 'పొగరు'కు 64 లక్షలు తీసుకున్న‌ట్లు చెప్పింది ర‌ష్మిక మంద‌న్న‌. మొత్తానికి ఇప్పుడు విజయ్ సినిమాలో రష్మిక కాదన్న స్థానంలో కియారా అద్వానీని తీసుకుంటున్నారని తెలుస్తుంది. 

More Related Stories