English   

రామ్ చరణ్ హీరోయిన్ తో రణ్ బీర్ కపూర్ పెళ్లి.. 

Alia Bhatt
2019-09-08 17:08:10

బాలీవుడ్‌లో ఇప్పుడు ప్రేమ జంటలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. పైగా ఇప్పుడు అక్కడ పెళ్లిళ్ళ సీజన్ కూడా నడుస్తుంది. ప్రేమించిన తర్వాత ఎవరూ విడిపోవడం లేదు. పక్కా పెళ్లి పీటల వరకు వెళ్తున్నారు. ఇప్పుడు రణ్ బీర్ కపూర్, అలియాభట్ కూడా అలాగే పెళ్లి చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. అక్టోబర్ లో వీళ్ల ఎంగేజ్‌మెంట్ జరగనుందని.. పెళ్లి మాత్రం 2020 సమ్మర్ లో ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు అయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న 'బ్రహ్మాస్త్ర'లో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున ఇందులో కీలక పాత్రల్లో కనిపిస్తారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. ఈ సినిమా తొలి భాగం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సమయంలో అలియా భట్ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలో నటిస్తుంది. ఇందులో రామ్‌చరణ్ హీరోయిన్‌గా నటిస్తోంది అలియా. మొత్తానికి అటు తెలుగు, ఇటు హిందీ సినిమాలు చేస్తూనే తను కోరుకున్న ప్రియుడు రణ్ బీర్ కపూర్ తో ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతుందని ప్రచారం జరుగుతుంది. 

More Related Stories