English   

సైరా ప్రీ రిలీజ్ బిజినెస్.. బయటికొస్తున్న ఆసక్తికరమైన విషయాలు..

 Sye Raa
2019-09-08 17:31:42

చిరంజీవి సినిమా అంటే బిజినెస్ ఎలా అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాను కొనడానికి బయ్యర్లు పోటీపడుతుంటారు. అయితే అది కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. ఎందుకంటే చిరంజీవి మనకు మెగాస్టార్.. బయట ఇండస్ట్రీలకు ఆయన ఒక హీరో మాత్రమే. చిరంజీవి అంటే ఉన్న ఇమేజ్ తెలంగాణ ఆంధ్రలో మాత్రమే పని చేస్తుంది. ఇప్పుడు సైరా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నేషనల్ వైడ్ ప్రాజెక్టు అంటూ రామ్ చరణ్ ఈ సినిమాను దాదాపు 200 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మిస్తున్నాడు. అయితే బిజినెస్ మాత్రం ఆ స్థాయిలో జరగడం లేదని తెలుస్తోంది. తెలుగులో భారీగానే బిజినెస్ చేస్తున్న సైరా నరసింహారెడ్డి.. హిందీలో మాత్రం చాలా తక్కువతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు తెలుగులో ఈ చిత్ర బిజినెస్ 80 కోట్ల వరకు జరిగింది.. ఇంకా కొన్ని ఏరియాల్లో జరుగుతుంది. 

ఒక్క సీడెడ్ ప్రాంతంలోనే సైరా 22 కోట్ల ధర పలికిందని తెలుస్తుంది.. ఉత్తరాంద్రలో 14.4 కోట్లు.. గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాల్లో 11.50 కోట్లు, 8.40 కోట్లకి సినిమాను అమ్మినట్లు తెలుస్తుంది. నెల్లూరులో సైరా రైట్స్ 4.80 కోట్లకి అమ్ముడు పోగా.. కృష్ణా ప్రాంతంలో దాదాపుగా 8.5 కోట్ల ధర పలికిందని ప్రచారం జరుగుతుంది. కేవలం ఆంధ్రాలో మాత్రమే 80 కోట్లకు ఈ సినిమాను అమ్మేస్తున్నారు. బాహుబలి 2, సాహో సినిమాల తర్వాత ఆ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్న సినిమా ఇదే. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా బిజినెస్ జరుగుతుంది. అన్నీ పూర్తైన తర్వాత కచ్చితంగా సైరా ఏపీ, తెలంగాణ కలిపి ఈజీగా 130 కోట్లకు పైగానే జరుగడం పక్కాగా కనిపిస్తుంది. అక్టోబర్ 2న తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ, మళయాళ భాషల్లో సైరా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక హిందీలో కూడా సైరా ఆశించిన స్థాయిలో కాకుండా కాస్త తక్కువగానే బిజినెస్ చేస్తుంది. 

అక్కడ ఈ సినిమాను 40 కోట్ల రేంజ్ లోనే ఫర్హాన్ అక్తర్ తీసుకున్నాడు. 50 కోట్ల వరకు హిందీ రైట్స్ అమ్మాలని చరణ్ ఎంత ప్రయత్నించినా కూడా అది వర్కౌట్ కాలేదు. పైగా అందులో అమితాబ్ బచ్చన్ ఉన్నాడు కాబట్టి 40 కోట్ల వరకు రైట్స్ తీసుకున్నారని.. ఆయన కూడా లేకపోయి ఉంటే పరిస్థితి మరింత తక్కువగా ఉండేదని తెలుస్తోంది. చిరంజీవి మెగాస్టార్ అయినా కూడా హిందీలో ఆయనకు అంత మార్కెట్ లేదనే విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. అయితే ఇదే సమయంలో సాహో సినిమా రైట్స్ మాత్రం 80 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. దీనికి కారణం బాహుబలి సినిమా అక్కడ 600 కోట్ల వరకు వసూలు చేసింది. అందుకే ప్రభాస్ పై నమ్మకంతో సాహోను భారీ రేటుకు కొన్నారు. నెగిటివ్ టాక్ వచ్చినా కూడా సాహో భారీగానే వసూలు చేసింది. బిజినెస్ విషయంలో సాహో, సైరా మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విషయంలో చిరంజీవి కంటే ప్రభాస్ చాలా ముందున్నాడు. 

More Related Stories