English   

ఆ వేడుకకి ముఖ్య అతిధిగా మహేష్

mb
2019-09-08 19:21:48

భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019 వేడుకకు సమయం దగ్గర పడింది. దాదాసాహెబ్ 150వ జయంతిని పురస్కరించుకొని ఈ అవార్డ్స్ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖుల్ని సత్కరించనున్నారు. ఈ వేడుకకు హైదరాబాద్‌లోని మాదాపూర్, ఎన్ కన్వెన్షన్ ఈ వేడుకకు వేదిక కానుంది. మరో పదిరోజుల్లో సెప్టెంబర్ 20న ఈ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. భారతీయ సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడంలో సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ కృషి ఎంతయినా ఉంది. ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎన్నో ఏళ్లుగా ఎంతో కృషి చేస్తున్నారు. వారిని గౌరవించేందుకు దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని అనుకున్నారు. కానీ ఆయన స్థానే కొత్త గవర్నర్ రావడంతో ఈ విషయం మీద సందిగ్దత నెలకొంది. అయితే ఈ కార్యక్రమానికి దాదాసాహెబ్ ఫాల్కే మనవడు సి ఎస్ పుసాల్కర్ ముఖ్య అతిధిగా హాజరౌతున్నారు. ఇక ఈ ఈవెంట్ కి సూపర్‌స్టార్ మహేష్‌బాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని చెబుతున్నారు. ఈ  విషయాన్ని దృవీకరిస్తూ దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారని చెబుతున్నారు. ఇక ఈ వేడుక ను ప్రత్యక్ష్యంగా వీక్షించాలనుకునే వారి కోసం ఆన్‌లైన్‌లో టికెట్లను అందుబాటులో ఉంచారు దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ నిర్వాహకులు.

More Related Stories