English   

మెగాస్టార్ తో సూపర్ స్టార్.. ఆత్మీయ ఆలింగనం..

Maheahbabu-with-Chiru.jpg
2019-09-09 06:51:57

తెలుగు ఇండస్ట్రీకి ఒకరేమో మెగాస్టార్.. మరొకరు సూపర్ స్టార్.. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. ఈ అరుదైన సంఘటన సినీ మహోత్సవంలో చోటు చేసుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ ఈవెంట్ కు మహేష్ బాబుతో పాటు చిరంజీవి కూడా ముఖ్య అతిథిగా వచ్చాడు.

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి తెలుగు సినిమా ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. పవన్ కల్యాణ్ కూడా వస్తాడనే వార్తలు వచ్చాయి. కానీ చివరికి మహేష్ బాబు మాత్రం వచ్చాడు. ఆయనతో పాటు చిరంజీవి కూడా అక్కడ కనిపించాడు. దాంతో మెగాస్టార్, సూపర్ స్టార్ కలిసి ఒకే ఫోటోలో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. 

ఇదే వేడుకకు మురళీ మోహన్, దిల్ రాజు, కోట సహా తెలుగు సినిమా ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. టాలీవుడ్ అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి. మొత్తానికి ఏదేమైనా కూడా ఇద్దరు సూపర్ స్టార్స్ ఇలా కలవడం కూడా అరుదుగానే జరుగుతుంది. 

More Related Stories