English   

అలీ ఎలిమినేషన్...రక్తి కట్టించిన హౌస్ మేట్స్

 Ali Reza
2019-09-09 08:32:51

తెలుగు బుల్లితెర మీద మంచి టీఆర్పీలతో సాగుతోన్న రియాలిటీ షో 'బిగ్ బాస్'. ఈ షో మూడో సీజన్ ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ నిన్నటికి 7వ వారం పూర్తిచేసుకుంది. నాగార్జున హోస్ట్‌ చేస్తున్న ఈ షోకి నిన్న నాని కూడా వస్తాడని మా టీవీ ప్రోమోలో చూపడంతో నిన్నటి ఎపిసోడ్ మీద ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నడూ లేనిది ఇద్దరు రావడంతో ఇద్దరు ఎలిమినేట్ అవుతారేమో అనే అనుమానాలు కూడా జనాల్లో మొదలయ్యాయి. కానీ ఆ అనుమానాలకి బ్రేక్ వేస్తూ నిన్నన నాగ్ ఎలిమినేషన్ ప్రకటించారు. నిజానికి గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్‌లో భాగంగానే నాని హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి నాగార్జునతో కలిసి సందడి చేశాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో అలీ రెజా, రవికృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, మహేష్ విట్ట, శ్రీముఖి ఉన్న సంగతి తెలిసిందే. ఈ జోన్ నుండి రాహుల్ సిప్లిగంజ్ శనివారమే సేఫ్ జోన్‌ లోకి వచ్చాడని నాగార్జున ప్రకటించారు. 

దీంతో ఇక మిగిలిన నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆసక్తి నెలకొంది. అయితే అందరూ ఊచించినట్టుగానే బిగ్‌బాస్ హౌస్‌ నుంచి అలీ రెజాను ఎలిమినేట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ముందు నుండీ అలీ రెజా పేరు ప్రచారం జరిగినా ఎవరూ పెద్దగా నమ్మలేదు. ఎందుకంటే ఈ సీజన్ లో అతనొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావడం అలాగే అతని పేరు కూడా మొదటి సారి నామినేట్ కావడం. అది కూడా చాలా సిల్లీ రీజన్స్ తో. అయితే ఈ ప్రక్రియ అంతా బాగానే ఉన్నా అలీ ఎలిమినేట్ అయ్యాడన్న విషయం ప్రకటించగానే శ్రీముఖి, శివజ్యోతిలు వెక్కి వెక్కి ఏడ్చి కాసేపు షోని రక్తి కట్టించారు. తనకి మంచి ఫ్రెండ్ కావడంతో శ్రీముఖి, తాను నామినేట్ చేయడం వలెనే ఎలిమినేట్ అయ్యాడనే భావనలో ఉన్న శివజ్యోతి ఇద్దరూ చాలా సేపు ఏడ్చారు. ఇక మిగిలిన వారు కూడా కాస్త భావోద్వేగానికి గురయ్యారు.  

More Related Stories