English   

మహేష్ చేతికి గాయం...అసలేమైంది

Mahesh Babu
2019-09-09 09:01:00

వెండితెరపై మెరిసే తారలు అందరూ ఒకే వేదికపై కనిపించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ నిన్న ఒక వేడుక కోసం అందరూ కలిశారు. తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ‘సినీ మహోత్సవం’ అనే ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ఈ ఉత్సవంలో తెలుగు సినీ తారలు తమ ఆట పాటలతో ఆద్యంతం అదరగొట్టారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, మహేష్‌బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు  ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ఒక పిక్ మాత్రం వైరల్ గా మారింది. అదే మహేష్ బాబు, చిరంజీవి కలిసి మాట్లాడుతున్న పిక్. మెగాస్టార్, సూపర్ స్టార్ కలిసి ఒకే ఫోటోలో కనిపించడంతో సినీ అభిమానులు ఖుషీ అయ్యారు. 

అయితే మహేష్ అభిమానులు మాత్రం ఈ పిక్ లో మహేష్ చేతికి ఉన్న గాయాన్ని చూసి బాధ పడుతున్నారు. చిన్న గాయంలా కనిపిస్తున్న దానికి వారు బాధ పడిపోతున్నారు. అన్నా నువ్ జాగ్రత్త అన్నా నీకేమయినా అయితే మేము తట్టుకోలేము అంటూ కామెంట్స్ పెడుతూ ఈ పిక్ ను వైరల్ చేస్తున్నారు. అసలు అది గాయమో లేక ఏదైనా రంగు లాంటిది అందుకుందో తెలీదు కానీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వేడుకలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తనదైన పెర్ఫార్మన్స్ తో దుమ్మురేపగా, అనసూయ, పూజా హేగ్దేలు తమ నాట్యంతో అలరించారు. ఇక ఈ వేడుకలో జయసుధ, జయప్రద, రాజేంద్ర ప్రసాద్, రాఘవేంద్రరావు, అశ్వినీదత్, రకుల్, పూజా హేగ్డే, లావణ్య త్రిపాఠి, బివిఎన్ ప్రసాద్, బోయపాటి సుమలత, జీవితలు సందడి చేశారు. ఇక ఇదే వేదిక మీద సీనియర్ నటులు మురళీమోహన్, కృష్ణంరాజు, గిరి బాబు, గీతాంజలిలకి సన్మానం కూడా నిర్వహించారు.  

More Related Stories