English   

సైరా సినిమా వాయిదా తప్పదా ?

Sye Raa Narasimha Reddy
2019-09-09 11:25:43

సైరా సినిమా వాయిదా ? ఈ వార్త ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తూనే ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ గురించి ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ సరయిన వివరణ ఇవ్వకపోవడంతో ఆ వార్త మళ్ళీ మళ్ళీ ప్రచారం అవుతూనే ఉంది. నిజానికి చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక 'సైరా' సినిమా విడుదలకు అంతా సిద్దమే అని ప్రచారం జరిగింది. సినిమా ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టడంతో ఇక ఈ సినిమా రిలీజ్ లాంచనమే అని భావించారు అంతా, అయితే అదేమిటో కానీ వార్ ట్రైలర్ రిలీజ్ కాగానే ఈ సినిమా ఖచ్చితంగా వాయిదా పడుతుందని ప్రచారం మొదలయింది. బాలీవుడ్ లో ఆ సినిమా దెబ్బకి ఈ సినిమాకి థియేటర్ లు దొరకవని అందుకే ఈ సినిమా వాయిదా వేయాలని అక్కడి పంపిణీదారులు కోరారని అందుకే సినిమా వాయిదా వేస్తున్నారని ప్రచారం జరిగింది. 

దానికి నిర్మాత చరణ్ అనధికారికంగా ఖండించాడని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్స్‌ పూర్తి కాలేదని ప్రకటించిన తేదీకి మరో వారం డిలే చేసి ఆ తర్వాత సినిమా రిలీజ్‌ చేయబోతున్నారని అంటున్నారు. నిజానికి ఈ సినిమాను అక్టోబర్‌ 2న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. వారం లేట్ అంటే ఇక తొమ్మిదవ తారీఖునే రిలీజ్ అవనుందని అంటున్నారు. అయితే ఈ విషయం మీద ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి కానీ, చరణ్ నుండి కానీ చిరంజీవి నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మరోపక్క ఈ సినిమా ప్రమోషన్‌స్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. డియర్ కామ్రేడ్, సాహో సినిమా యూనిట్స్ లానే ఈ యూనిట్ కూడా చెన్నై, ముంబాయి, బెంగళూరు వంటి నగరాల్లో ప్రమోషన్స్ కోసం సన్నాహాలు చేస్తోందని అంటున్న్నారు.

More Related Stories