English   

పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ ప్రేమలేఖ

pawan kalyan
2019-09-09 14:50:56

పవన్ కళ్యాణ్...ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు. చిరంజీవి తమ్ముడిగా సినిమాలలోకి అగుగుపెట్టిన పవన్ ఆ తర్వాత పవర్ స్టార్‌గా తన సామ్రాజాన్ని స్థాపించుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా నిలిచాడు. ఇక ఈమా మధ్య సినిమాలు వదిలేసి పాలిటిక్స్‌లో అడుగుపెట్టిన ఆయన జనసేనానిగా మరి ప్రజల సమస్యల పరిష్కరిణ దిశగా పయనిస్తున్నారు. అయితే ఆయనకి మూడు పెళ్ళిళ్ళు అనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక పూనమ్ కౌర్ విషయంలో కూడా కత్తి మహేష్ కొన్ని విమర్శలు చేశారు. తాజాగా తెలుగు హీరోయిన్ ఒకరు పవన్ కి రాసిన ప్రేమ లేఖ ఒకటి వైరల్ గా మారింది. గతంలో నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసినపుడు పవన్ కు బాసటగా నిలిచిన నటి, బీజేపీ నేత మాధవీలత ఈ ప్రేమ లేఖ రాసింది. ఆమె గత ఎన్నికల ముందు, బీజేపీలో జాయిన్ అయ్యి గుంటూరు నుంచి ఆమె ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది. ఇక 2000 సంవత్సరంలో పూరీ పవన్ ల కాంబినేషన్ లో వచ్చిన బద్రి సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్ కాగా ఇప్పుడు విజయ్ కి ఉన్న క్రేజ్ అప్పట్లో పవన్ కి ఉండేది. అమ్మాయిల ఫాలోయింగ్ భీబత్సంగా ఏర్పడింది. ఈ సినిమా చూసిన కొత్తలో మాధవీ ఒక ప్రేమ లేఖ రాసుకుందట, ఆ సంవత్సరం, జూన్ 6 వ తేదీన ఆ కవితను రాసుకున్న ఆమె తన పేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది.
మనసులో ఏదో వేదనకారణం తెలియక పడుతున్నా తపన

హృదయంలో అనురాగం అనే భావనదానికో రూపం ఇచ్చేందుకే ఈ సాధన

నీవు కనిపించగానే నా హృదయంలో ఏదో బాధ
నా మనస్సుని ఎవరో గట్టిగా పట్టేసినట్టుగా వేదన

ఒక పక్క సంతోషం, మరోపక్క దుఃఖం కానీ,.... కానీ ఎందుకో తెలీదు

నిను చూస్తున్న ప్రతీక్షణం నేను కారణం చెప్పలేని భావాలలో విలవిల్లాడిపోతాను.

దానికి అర్థం ఏంటి? నేను ఎందుకిలా అవుతున్నాను?ఇది ఆకర్షణా? ప్రేమ అనే వ్యామోహమా?

నో . కానే కాదు. అటువంటిది కాదు. మరేంటి?.....?'' అంటూ ఆ కవిత సాగింది. అయితే ఆమె రాసిన కవిత మీద మిశ్రమ స్పందన వస్తోంది. తెలుగు ఫాంట్ రాసిన పెన్, పవన్ కళ్యాణ్ అని రాసిన పెన్ వేరు వేరు గా అనిపిస్తుంది...ఏంటి బీజేపీ లో  బిచాణా  ఎత్తేసావా ?!? కొంపదీసి  ఈ  పోస్ట్  పీకే  గారికి బిస్కెట్  వేసి సేఫ్ సైడ్ జనసేన  లో చేరడానికా... నీ పప్పులు ఉడకవు....అంటూ ఒకరు పోస్ట్ చేస్తే అప్పుడెప్పుడో ఒక టీవీ చానెల్ లో మీరు పవన్ కళ్యాణ్ కోసం నేను రాసుకున్న ...ప్రేమ కవితను చూయిస్తానని అన్నారు...మాట మీద నిలబడ్డారని మరొకరు కామెంట్ చేశారు.

ఈ కవిత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉండగా నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆ రోజు పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పెద్ద పండగే. ట్విట్టర్‌లో రికార్డులు క్రియేట్ చేయడానికి పవన్ ఫ్యాన్స్ మొన్న సాయంత్రం నుంచి ట్వీట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఫ్యాన్స్ బేస్ భారీ స్థాయికి చేరడంతో కేవలం 24 గంటల్లోనే ట్వీట్ల సంఖ్య 10.5 మిలియన్లకు చేరుకుంది. దీంతో ఇండియాలో ఇప్పటివరకు అతిపెద్ద బర్త్‌డే ట్రెండ్ రికార్డు పవన్ కళ్యాణ్ పేరిట నమోదైంది. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ చరిష్మా సినిమాలు చేయకపోయినా ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఏది ఏమైనా జనసేనాని రాజకీయాల్లో ఉన్నా.. సినిమాల్లో ఉన్నా ఆయన పవర్‌కు రికార్డులు బ్రేక్ కావాల్సిందే.

More Related Stories