English   

వాల్మీకి ట్రైలర్.. గత్తరలేపిర్రు.. చించేసిర్రు పో..

Valmiki Trailer
2019-09-09 16:46:58

వ‌రుణ్ తేజ్ అంటే ఇప్ప‌టి వ‌ర‌కు అందంగా.. గ్లామ‌ర్ గా క‌నిపించాడు. ఎఫ్ 2 లాంటి సినిమాల్లో అయితే అమ్మాయిలు ఈయ‌న్ని చూసి ఫిదా అయిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం వాల్మీకి ట్రైలర్ చూసిన త‌ర్వాత వ‌రుణ్ తేజ్ ను చూసి భ‌య‌ప‌డ‌తారంతా. అంత‌గా ఈ చిత్రం కోసం మారిపోయాడు మెగా వార‌సుడు. ఇప్పటికే విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు భారీగా పెంచేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ అయితే మరో స్థాయిలో ఉంది. ముఖ్యంగా డైలాగ్ డెలవరీలో కూడా పిచ్చెక్కించాడు వరుణ్ తేజ్. హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై ముందు నుంచి కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. పైగా త‌మిళ‌నాట భారీ విజ‌యం సాధించిన జిగ‌ర్తాండ సినిమా రీమేక్ కావ‌డంతో ఆస‌క్తి పెరిగిపోతుంది. ఇందులో నెగిటివ్ కారెక్ట‌ర్ చేస్తున్నాడు వ‌రుణ్ తేజ్. అక్క‌డ బాబీ సింహా చేసిన పాత్ర ఇది. అక్కడి కంటే ఇక్కడ మరింత పవర్ ఫుల్ గా డిజైన్ చేసాడు హరీష్ శంకర్. ట్రైలర్ లో వరుణ్ తేజ్ ను హైలైట్ చేసిన తీరు చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. ముఖ్యంగా పూజా హెగ్డే వచ్చినపుడు ఎల్లువొచ్చి పాటను ఆర్ఆర్ కింద వాడేసుకున్నాడు హరీష్. ఇక సిద్ధార్థ్ పాత్ర‌లో త‌మిళ హీరో అథ‌ర్వ ముర‌ళి న‌టిస్తున్నాడు. డిజే త‌ర్వాత మ‌రోసారి హ‌రీష్ శంక‌ర్ త‌న సినిమాలో పూజా హెగ్డేకు ఆఫ‌ర్ ఇచ్చాడు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 20న విడుద‌ల కానుంది. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తుంది. ట్రైలర్లో వ‌రుణ్ తేజ్ ను చూసి అంచ‌నాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. క‌చ్చితంగా ఈ చిత్రంతో మ‌రో విజ‌యం అందుకుంటాన‌ని ధీమాగా చెబుతున్నాడు మెగా హీరో. హరీష్ శంకర్ కూడా ఈ చిత్రాన్ని మంచి కసితో తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. ట్రైలర్ లో అడుగడుగునా ఆ కసి కనిపిస్తుంది. మరి ఈ చిత్రంతో వరుణ్ తేజ్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.

More Related Stories