English   

బోయపాటి శ్రీను మారిపోయాడు.. స్టార్ హీరోలపై కమెంట్స్..

srinu
2019-09-09 20:32:55

బోయపాటి శ్రీనుతో సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాలో హీరో ఎవరైనా కూడా రక్తం మాత్రం ఏరులై పారుతుంది. మరీ ముఖ్యంగా కొన్ని సినిమాల్లో అయితే ఏకంగా తలకాయలు నరికితే గద్ధలు కూడా వచ్చి క్యాచ్ పడుతుంటాయి. అంత మాస్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తుంటాడు బోయపాటి శ్రీను. మొన్నటి వరకు బాగానే వర్కవుట్ అయిన ఈయన కథలు ఇప్పుడు తేడా కొడుతున్నాయి. రామ్ చరణ్ హీరోగా ఈయన తెరకెక్కించిన వినయ విధేయ రామ డిజాస్టర్ కావడం బోయపాటి కెరీర్ కు పెద్ద షాక్. ఈ షాక్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నాడు ఈయన. జనవరిలో వచ్చింది ఈ చిత్రం.. కానీ ఇప్పటి వరకు మరో సినిమా మొదలు పెట్టలేకపోయాడు. కనీసం హీరోలను కూడా ఒప్పించలేకపోయాడు. బాలయ్య సినిమా ఓకే అయినా కూడా ఇప్పటి వరకు ఇంకా ఏం తేలలేదు.

మరో ఆర్నెళ్ళ తర్వాత బోయపాటికి బాలయ్య దొరకడు. ఈయన ప్రస్తుతం కెయస్ రవికుమార్ సినిమా చేస్తున్నాడు. ఈ గ్యాప్ లో బోయపాటి తనకు తెలిసిన సినిమా వాళ్ల వేడుకలకు ముఖ్య అతిథిగా వెళ్తున్నాడు. ఇప్పుడు సుదీప్ పహిల్వాన్ ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చాడు. ఇందులో టాలీవుడ్ హీరోలపై ఆసక్తికరమైన కమెంట్స్ చేసాడు ఈయన. మన హీరోలు మారిపోయారని.. కథలు డిమాండ్ చేస్తే ఎలా మారిపోవడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పాడు బోయపాటి శ్రీను. ఒకప్పుడు కాస్త ఆటిట్యూడ్ చూపించిన ఈయన ఇప్పుడు మాత్రం హీరోలకు భజన చేస్తున్నాడు. రామ్ చరణ్, బన్నీ, మహేష్, ప్రభాస్ లాంటి హీరోలు కథల కోసం మారిపోయారని గుర్తు చేసాడు. బాలయ్య అయితే ఇప్పుడు తాను చేస్తున్న సినిమా కోసం 11 కేజీలు తగ్గిపోయాడని తెలిపాడు బోయపాటి. మొత్తానికి బోయపాటి శ్రీను వ్యాఖ్యలు చూస్తుంటే తాను మారిపోయాను.. ఒక్క ఆఫర్ ఇవ్వండి బాబోయ్ అన్నట్లు అనిపిస్తుంది. మరి ఈయన మార్పును గమనించే హీరోలు ఎక్కడున్నారో..?

More Related Stories