రసవత్తరంగా నామినేషన్స్ ...రవి సేఫ్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. మొదటి వారంలోనే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషు రెడ్డి, ఇక తాజాగా అలీ రెజా ఎలిమినేట్ అయ్యాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మళ్ళీ ఎలిమినేషన్స్ కోసం నామినేషన్స్ మొదలయ్యాయి. ఇక ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులను రెండు టీమ్స్‌గా విడగొట్టాడు బిగ్ బాస్. బాబా భాస్కర్ కెప్టెన్ అయిన కారణంగా ఆయనను మాత్ర్రం స్వతంత్రంగా ఉంచేసారు. అయితే ఓ టీమ్‌లోని సభ్యుడు ఇంకో టీమ్‌లోని ఇద్దరు కంటెస్టెంట్లను నామినేట్ చేయాల్సి ఉంటుందని తెలిపాడు. వరుణ్, వితికా, రాహుల్, పునర్నవి, శిల్పాలను ఓ టీమ్ గా శ్రీముఖి, హిమజ, రవి, శ్రీముఖి, శివజ్యోతిలను మరో టీమ్ గా విభజించాడు.
తమ ఎదురు గ్రూప్ లో ఉన్న ఇద్దరి ఫొటోలను తీసుకుని మంటల్లో కాల్చి నామినేట్ చేయడానికి సరైన రీజన్ చెప్పాలని బిగ్ బాస్ తెలిపాడు. అలా ఎవరి రీజన్స్ వారు చెబుతూ చివరికి ఎక్కువ నామినేషన్స్ వచ్చిన శిల్పా చక్రవర్తి, హిమజ, రవి, శ్రీముఖి, పునర్నవి, మహేష్ నామినేట్ అయ్యారు. అయితే కెప్టెన్ అయిన బాబా భాస్కర్‌కు ఒకర్ని సేవ్ చేసే అవకాశాన్ని బిగ్‌బాస్ ఇచ్చాడు. అయితే అందరూ మహేష్ లేదా శ్రీముఖిని సేవ్ చేస్తారని భావించినా రవిని సేవ్ చేస్తున్నట్లు తెలిపి రవికి ఊరట నిచ్చాడు. దీంతో నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని ఈ వారం శిల్పా చక్రవర్తి, హిమజ, శ్రీముఖి, పునర్నవి, మహేష్‌లు నామినేట్ అయినట్లు ప్రకటించాడు.