English   

హీరోయిన్ కు రక్తంతో లవ్ లెటర్ రాసిన అలీ తమ్ముడు

 Sanghavi
2019-09-10 12:31:39

1990లలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ సంఘవి. సంఘవి అసలు పేరు కావ్యా రమేష్‌. అజిత్ హీరోగా తెరకెక్కిన ‘అమరావతి’ ఆమె తొలి చిత్రం. విజయ్‌, అజిత్‌, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి లాంటి అగ్ర హీరోల సరసన నటించి ఆమె దక్షిణాది అభిమానులను మెప్పించింది. సంఘవి ఐదేళ్ళ క్రితమే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. 2010 తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. తాజాగా ఆమె బుల్లి తెర మీదా అలాగే వెండి తెర మీద రీ ఎంట్రీ ఇచ్చింది. ఈమె ఆలీతో సరదాగా షోలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. 

తాను హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో అలీ తమ్ముడు తనకు చాలా లెటర్స్ రాశాడని, అందులో కొన్ని రక్తంతో కూడా రాశాడని చెప్పుకొచ్చింది. ఆ విషయం సంఘవి చెప్పగానే షాక్ తిన్న అలీ వెంటనే తేరుకుని ఇంకా నయం నేను ఇచ్చానని చెప్పి ఇవ్వలేదు కదా అని వాతావరణాన్ని చల్ల బరిచాడు. అలానటి ప్రముఖ కన్నడ సినిమా నటి ఆరతి, సంఘవి నాయనమ్మకు చిన్న చెల్లెలు. దీంతో ఆమె సినిమా షూటింగులకు వెళ్ళినప్పుడల్లా సంఘవి ఆమె వెంట వెళ్ళేది. అప్పుడే సినిమాలలో నటించాలన్న కోరిక క్రమంగా పెరుగుతూ వెళ్ళగా ఆమె ఆసక్తిని గమనించిన నాయనమ్మ కూడా అందుకు సహకరించారు. అలా ఆమె హీరోయిన్ గా ఎదిగింది.

More Related Stories