ఒరేయ్ బుజ్జిగా అంటూ మొదలెట్టేశారు

గుండె జారి గల్లంతయిందే, ఒక లైలా కోసం లాంటి సినిమాలని తెరకెక్కించి మంచి డైరెక్టర్ అనిపించుకున్న విజయ్ కుమార్ కొండా చాన్నాళ్ళగా సినిమాలకి దూరంగా ఉన్నాడు. దాదాపు ఐదు సంవత్సరాలుగా ఆయన ఎలాంటి ప్రాజెక్ట్ చేయలేదు. ఆ మధ్య ప్రేమ పెళ్ళి వలన కాస్త పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ కావడంతో ఆయన సినిమాలకి బ్రేక్ ఇచ్చాడు. ఆ మధ్య కన్నడ నటుడు నిఖిల్ బర్త్ డే సేలేబ్రేషన్స్ లో కనిపించడంతో ఆయనతో సినిమా ఉంటుందని భావించారు. అయితే అనూహ్యంగా ఆయన కుర్ర హీరో రాజ్‌తరుణ్‌తో తన కొత్త సినిమా ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ఈరోజు నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్తోంది. ఇక ఈ సినిమాకి 'ఒరేయ్.. బుజ్జిగా' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు.
ఈ రోజు నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగనున్న ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వాణి విశ్వనాధ్, నరేష్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్రలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి గత కొంత కాలంగా సక్సెస్ లేని అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. నిజానికి హీరో రాజ్ తరుణ్ - డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా అలాగే నిర్మాత కేకే.రాధామోహన్ - అనూప్ రూబెన్స్ వీళ్ళు నలుగురూ హిట్ కోసం పరితపిస్తున్నారు. ఈ సినిమా ఈ నలుగురికి ఎంతవరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి మరి.