English   

ఆర్డీఎక్స్ లవ్ ట్రైలర్ : సింహం కూడా కుక్కపిల్లే !

rdx
2019-09-10 18:06:47

‘హుషారు’ ఫేమ్ తేజు హీరోగా ఆరేక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ‘ఆర్డీఎక్స్ లవ్’ చిత్రం రూపుదిద్దుకుంది. త్వరలో రిలీజ్ కానున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. లవ్, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ కి మేళవించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ మూవీలో పాయల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నదని ట్రైలర్ ద్వారా తేల్చారు. ఆమె పాత్రకు తగ్గట్టే ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉంచారు. అయితే ఈ సినిమా హీరోయిన్ ఓరిఎంటేడ్ అని అర్ధం అయిపోతోంది. అందుకు తగ్గట్టే పాయల్ కు మంచి డైలాగ్స్  ఇచ్చారు..

” వేటాడాలని అనుకునే మగవాళ్లకు  ఆడపిల్ల లేడిపిల్లలా కనిపించవచ్చు.. అదా ఆడపిల్ల వేడాలని అనుకుంటే మగసింహం కూడా కుక్కపిల్లాలా కనిస్తుంది”…  “అమ్మాయిలతో మాట్లాడలంటే నిజం చెప్పి, బతిమాలాడండి కరిగిపోతారు..అబద్దం చెప్పి బాధపెట్టకండి..కరిగించేస్తారు” అనే డైలాగ్స్ ఈ సినిమా మీద అంచనాలు పెంచేవిధంగా ఉన్నాయి. రామ్ మునీష్ సమర్పణలో హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రధన్ సంగీతం, సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చూడాలి ఈ సినిమాతో పాయల్ పాప హిట్ కొడుతుందో లేదో. ఇంకెందుకు ఆలశ్యం మీరు కూడా చూసేయ్యండి.

 

More Related Stories