English   

మహేష్ తో ఆ సాంగ్...ఆమె ఫైనల్ అయినట్టే

Pooja Hegde
2019-09-12 12:30:26

సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం షూట్ లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ప్రారంభం సమయంలోనే ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే కాశ్మీర్ లో షూట్ జరుపుకోగా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ట్రైన్ షెడ్యూల్ షూట్ చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఐటెం సాంగ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఈ సినిమాలో ఐటం సాంగ్ ని మిల్కీ బ్యూటీ తమన్నా చేత చేయిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి దాకా ఏ హీరోయిన్ అనేది అనుకోలేదని, అయితే ప్రస్తుతం ఈ సాంగ్ చేసే విషయమై పూజా హెగ్డేతో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. 

పూజకి స్పెషల్ సాంగ్స్ కొత్త ఏమీ కాదు. గతేడాది ఆమె రంగస్థలం చిత్రంలో చరణ్ తో కలిసి జిగేలు రాణి అనే సాంగ్ చేయగా అది పెద్ద హిట్ గా మారింది. ఇక ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ కూడా ఓకే అయిపోతే అప్పుడు అఫీషియల్ గా ప్రకటించవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన రష్మికా మందన హీరోయిన్ గా నటిస్తోండగా చాన్నాళ్ళ గ్యాప్ తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  

More Related Stories