English   

సైరా ప్రీ రిలీజ్...మళ్ళీ మార్చారా

 Sye Raa
2019-09-12 15:03:07

మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. చిరంజీవి సరసన నయతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్..సైరా నరసింహారెడ్డి గురువైన గోసాయి వెంకన్న పాత్రలో నటించాడు. అలాగే కన్నడ స్టార్ హీరో సుదీప్, తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, జగపతి బాబులు కొద ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న సమయంలో ప్రమోషన్స్ ఎప్పటి నుంచి మొదలు పెడతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల కృతం సెప్టెంబ‌ర్ 18న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను క‌ర్నూలులో నిర్వ‌హించ‌బోతున్నార‌ని ప్రచారం జరిగింది. 

నరసింహారెడ్డి ఆ ప్రాంతానికి చెందినవాడే కావడంతో అక్కడ నిర్వహించాలని ప్లాన్ చేశారట. అయితే ఇప్పుడు తాజాగా ఈ ఈవెంట్ జరిగే స్థలాన్ని మార్చినట్టుగా చెబుతున్నారు. కర్నూలలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తూండటంతో వాటి వలన ఈవెంట్ కి ఇబ్బందిగా మారకూడదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాంతో కర్నూలు నుంచి హైదరాబాద్ గచ్చి బౌలి ఇండోర్ స్టేడియం కు ఈ ఈవెంట్ ను మార్చారని అంటున్నారు. దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉండగా అదే రోజున హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌ల ‘వార్’ సినిమా కూడా విడుదల కానుంది. దీంతో ఈ సినిమాను అదే రోజున విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి. 

More Related Stories