English   

అసిన్ కూతురిని చూశారా ?

 Asin
2019-09-12 15:19:13

కొన్నేళ్ళ క్రితం తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన అసిన్ ఇప్పుడు తెరమరుగు అయిపొయింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే ప్రేమ వివాహం చేసుకున్న ఈ కేరళ కుట్టి ఆ తర్వాత సినిమాలకి దూరం అయిపొయింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మైక్రోమాక్స్‌ మొబైల్స్ సంస్థ అధినేత రాహుల్‌ శర్మను లవ్ చేసిన ఆమె 2015లో పెళ్లి చేసుకుంది. ఇక వీరి ప్రేమకు గుర్తుగా 2017 అక్టోబర్ 24న ఆడబిడ్డ జన్మించగా, ఆమెకు హరిణి అనే పేరు పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకూ పాప ఉందన్న సంగతి తెలుసు కానీ ఆ పాప ఎలా ఉంటుందన్న సంగతి అయితే అభిమానులు ఎవరికీ తెలియదు. తాజాగా ఓనం పండగ సందర్భంగా అసిన్‌ తన కూతురు హారిణి ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసి అందరికీ ఓనం శుభాకాంక్షలు తెలిపింది. అయితే హరిణి ఫోటో పోస్ట్ చేసింది ఇప్పుడే అయినా పిక్ తీసింది మాత్రం గత ఏడాది పాప మొదటి ఓనం జరుపుకున్నప్పుడంట. అయితే ఆమె కూతురి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

More Related Stories