English   

అప్పుడు ఉద్దానం.. ఇప్పుడు సేవ్ నల్లమల.. పడిన పవన్ కల్యాణ్ అడుగు..

 Pawan Kalyan
2019-09-12 16:18:18

పవన్ కల్యాణ్ అంత ఈజీగా ఏ పని పెట్టుకోడు.. ఒక్కసారి పెట్టుకుంటే అంత ఈజీగా వదలడు. ఇప్పుడు ఈయన సేవ్ నల్లమల అంటూ కదులుతున్నారు. ఈయనకు రాష్ట్రాలతో పనిలేదు.. సరిహద్దులతో అవసరం లేదు.. సమస్య ఎక్కడుంటే అక్కడ జనసేన ఉంటుందని చెప్పిన మాటలకు కట్టుబడి ఇప్పుడు తెలంగాణ వచ్చేసాడు పవర్ స్టార్. ఇక్కడే నల్లమల యురేనియం తవ్వకాలపై తన గళం వినిపిస్తున్నాడు. ఈ విషయంపై ప్రభుత్వంపై కూడా సీరియస్ అవుతున్నాడు పవన్ కల్యాణ్.

భావి తరాలకు బంగారు తెలంగాణ ఇస్తామని చెప్పి.. రోగాల తెలంగాణ ఇవ్వడానికి పూనుకుంటున్నారా అంటూ ఫైర్ అవుతున్నాడు పవన్ కల్యాణ్. నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవి ప్రాంతంలో జరుగుతున్న అక్రమ యురేనియం మైనింగ్ దందాపై అన్ని చోట్ల నుంచి వ్యతిరేక నినాదాలు దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు పవన్ కూడా ఈ ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నాడు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు హాని చేస్తుందని తెలిసినపుడు.. పర్యావరణం పాడవుతుందని తెలుస్తున్నపుడు కూడా ఎందుకు స్పందించడం లేదంటూ మండిపడుతున్నాడు పవన్ కల్యాణ్.

ఈ విషయంపై పవన్ ట్విట్టర్‌లో రాసిన లెటర్ వైరల్ అవుతుంది. అధికారంలో ఉన్న నాయకులను ఇందులో టార్గెట్ చేసాడు పవన్. భావి తరాలకి, బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్యం తెలంగాణ ఇస్తామా? అన్నది అన్ని ప్రజా సంఘాలు , రాజకీయ పక్షాలు ఆలోచించాలి అంటూ చెప్పాడు పవన్ కల్యాణ్. ఈ ఉద్యమానికి ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు కూడా సపోర్ట్ చేసాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ సైతం పవన్ వెంటనే నడుస్తున్నాడు. మరికొందరు సినిమా వాళ్లు కూడా సేవ్ నల్లమల అంటున్నారు. ఈ యురేనియం మైనింగ్ దందాతో తెలంగాణాలోని కొన్ని జిల్లాల ప్రజలకు లంగ్ క్యాన్సర్‌తో పాటు కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి తోడు తెలంగాణ ప్రాంతంలోని 48 గ్రామాలకు సంబంధించి 70 వేల మందికి ఆరోగ్య సమస్యలు రాకుండా రక్షించొచ్చు. అప్పుడు ఉద్దానం కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపించిన పవన్.. ఇప్పుడు కానీ నల్లమలకు పరిష్కారం చూపిస్తే తెలంగాణలో కూడా ఈయన రియల్ సూపర్ స్టార్ అయిపోతాడు.

More Related Stories