English   

అజయ్ భూపతి అలా ఫిక్సయ్యాడు.. సెన్సేషనల్ హీరోతో సినిమా..

Ajay Bhupathi
2019-09-12 16:37:31

ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా మారాడు అజయ్ భూపతి. తేడాది చిన్న సినిమాతో ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టించిన ఈయ‌న ఇప్పుడు మహా సముద్రం అనే మరో కథతో వస్తున్నాడు. ఇందులో ర‌వితేజ క్రిమిన‌ల్‌గా నటిస్తాడని ముందు చప్పాడు అజయ్. కానీ ఇందులోంచి మాస్ రాజా తప్పుకున్నాడిప్పుడు. చాలా రోజుల కిందే ఇది కన్ఫర్మ్ అయింది. అయితే రెండో సినిమా ఇంకా పట్టాలెక్కలేదు కానీ అప్పుడే మూడో సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చేసాడు అజయ్ భూపతి. ఈ దర్శకుడి మూడో సినిమాను తామే నిర్మించబోతున్నట్లు అనౌన్స్ చేసింది భవ్య క్రియేషన్స్. ఈ చిత్రం వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. ఇది కూడా తన స్టైల్లో సాగే కథే. వీలైనంత త్వ‌ర‌గా మహా సముద్రం సినిమా షూటింగ్ పూర్తి చేసి వ‌చ్చే ఏడాది మొద‌ట్లో విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు అజయ్ భూపతి. ఇందులో సిద్ధార్థ్ మరో హీరోగా నటిస్తున్నాడు. దీని తర్వాత మూడో సినిమా భవ్య క్రియేషన్స్ లో ఉండబోతుంది. ఇందులో ఓ సెన్సేషనల్ హీరో నటించబోతున్నాడని తెలుస్తుంది. మరి ఆయనెవరు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. అదెవరో త్వరలోనే చెప్తామంటున్నారు దర్శక నిర్మాతలు.

More Related Stories