English   

సమంత నిజంగానే రిటైర్మెంట్ ఇస్తుందా లేదంటే బ్రేక్ ఇస్తుందా..

Samantha
2019-09-12 16:54:12

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేయడం అనేది చిన్న విషయం కాదు. కానీ సమంత దీన్ని చాలా చిన్న విషయంగా మార్చేసింది. ఇప్పటివరకు తెలుగులో ఏ హీరోయిన్ చేయని విధంగా పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూనే ఉంది. ఒకప్పటి మాజీ హీరోయిన్లు ఇలా చేసేవాళ్ళు. కానీ ఈ తరంలో సమంతలా ఎవరు మాయ చేయలేదు. పెళ్లి తర్వాత కూడా అంతలా సినిమాలు చేయడం ఆమెకు మాత్రమే సాధ్యమైంది. రంగస్థలం, యూటర్న్, ఓ బేబీ, మజిలీ లాంటి సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది సమంత అక్కినేని. ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమాలకు కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్న 96లో నటిస్తోంది. ఈ సినిమా మొదలై కూడా చాలా రోజులు అయిపోయింది.. కానీ ఇప్పటివరకు మరో సినిమాకు సైన్ చేయలేదు సమంత అక్కినేని. సెప్టెంబర్ 16 నుంచి 96 కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. అక్టోబర్ చివర్లో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. సింగిల్ షెడ్యూల్ లోనే ఈ చిత్ర మిగిలిన షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా ఒప్పుకోకపోవడానికి కారణం కూడా కథలు నచ్చడం లేదని చెబుతుంది సమంత. కానీ అసలు కారణం అది కాదని.. కొన్ని రోజులు నటనకు బ్రేక్ ఇవ్వాలని సమంత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండి పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటుంది అక్కినేని కోడలు. అందుకే సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దానికి తోడు ఇకపై సినిమాలు చేసినా కూడా హీరోలతో నటించకుండా కేవలం లేడి ఓరియెంటెడ్ కథలు మాత్రమే చేయాలని సమంత ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మంచి కథ కుదిరితే భర్త నాగచైతన్యతో మాత్రమే నటిస్తాను అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఈ లెక్కన చూసుకుంటే సమంతను ఇకపై సినిమాల్లో చూడటం కష్టమే అని తెలుస్తోంది. మరి ఈ బ్రేక్ తర్వాత సమంత మళ్లీ పునర్వైభవం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

More Related Stories