English   

అఖిల్ కోసం పూజా హెగ్డేకు ఆస్తులు రాసిచ్చిన అల్లు అరవింద్..

Pooja Hegde
2019-09-12 17:08:37

అదేంటో తెలియదు కానీ అఖిల్ అక్కినేనికి మాత్రం హీరోయిన్ కష్టాలు తొలి సినిమా నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రతి సినిమాలో హీరోయిన్ సమస్యతో బాధపడుతూనే ఉన్నాడు ఈయన. ఇప్పుడు కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతున్నా కూడా హీరోయిన్ ఫైనల్ కాలేదు. వాళ్లూ వీళ్ళూ అంటూ పేర్లు వినిపిస్తున్నా కూడా ఎవ్వరూ కన్ఫర్మ్ కాలేదు. అయితే ఇప్పుడు పూజాహెగ్డే ఇందులో కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సినిమా కోసం ఏకంగా కోటి 25 లక్షలు తీసుకుంటుంది పూజా. ఇప్పటి వరకు నటించిన మూడు సినిమాలు అంచనాలను అందుకోవటంలో విఫలం కావడంతో ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ సినిమాపై దృష్టి పెట్టాడు అఖిల్. ఈ సినిమాతో హిట్ కొట్టి కచ్చితంగా రేస్ లోకి రావాలని చూస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాంతో ఈ సినిమా ఫలితంపై నమ్మకంగా కనిపిస్తున్నాడు అఖిల్. కచ్చితంగా భాస్కర్ సినిమాతో హిట్ కొట్టి అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాడు అక్కినేని వారసుడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే కన్ఫర్మ్ కావడంతో ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు. ఈ ఇద్దరికి అసలు జోడీ కదురుతుందా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వయసులో పూజా కంటే అఖిల్ చిన్నోడు పైగా చూడ్డానికి కూడా ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో తెలియదు. అయితే ఇదివరకు అన్నయ్య హీరోయిన్ నిధి అగర్వాల్ తో జోడీ కట్టాడు అఖిల్. ఇప్పుడు ఒక లైలా కోసం హీరోయిన్ పూజాతో రొమాన్స్ చేయబోతున్నాడు. మొత్తానికి చూడాలిక.. ఈ జోడీ ఎలా మాయ చేయబోతుందో..?

More Related Stories