English   

గ్యాంగ్ లీడర్ ఒరిజినల్ టాక్ ఏంటి.. హిట్టా ఫట్టా..?

gl
2019-09-13 18:37:32

నాని హీరోగా విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన సినిమా గ్యాంగ్ లీడర్. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలైంది. బేసిగ్గా విక్రమ్ సినిమాలంటే ఉండే ఆసక్తి వేరు.. కానీ ఎందుకో తెలియదు మరి ముందు నుంచి కూడా గ్యాంగ్ లీడర్ పూర్తిగా నాని మార్క్ సినిమా మాదిరే కనిపించింది. అలాగే విడుదలైంది కూడా. పూర్తిగా ఎంటర్ టైన్మెంట్ తో నిండొపోయి ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేసాడు విక్రమ్ కే కుమార్. ఇప్పుడు ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. ఫస్టాఫ్ ఏదో అలా ఉంది.. సెకండాఫ్ పర్లేదు అంటున్నారే కానీ పూర్తిగా సినిమా బాగుంది అని మాత్రం ఎవరూ చెప్పడం లేదు. పైగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని వెళ్తే మాత్రం కచ్చితంగా నిరాశ తప్పదు. ముఖ్యంగా కామెడీ సీన్స్ ఉన్నాయి కానీ వాటిని ఇరింకించినట్లే ఉండటం.. సిచ్యువేషనల్ కామెడీ లేకపోవడంతో గ్యాంగ్ లీడర్ చాలా చోట్ల నిరాశ పరిచాడు. అన్నింటికి మించి నాని గత సినిమా జెర్సీ పూర్తిగా ఎమోషనల్ ఎంటర్ టైనర్. కానీ ఇప్పుడు గ్యాంగ్ లీడర్ పూర్తిగా కమర్షియల్ సినిమా. కానీ వాటికి ఉండాల్సిన మసాలాలలో కొన్ని మాత్రమే ఉండి.. మిగిలినవి తగ్గిపోవడంతో గ్యాంగ్ లీడర్ ప్రయాణం ఇప్పుడు ప్రమాదంలో పడింది. మరో మూడు రోజులు ఆగితే దీని లక్ష్యం గురించి పూర్తి అవగాహన రానుంది. ఓపెనింగ్స్ వరకు అయితే గ్యాంగ్ లీడర్ సినిమాకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు

More Related Stories