English   

బాబోయ్.. విక్రమ్ కే కుమార్ కూడా ఇలా అయిపోయాడేంటి..?

vikram
2019-09-13 18:53:08

గ్యాంగ్ లీడర్ సినిమా చూసిన తర్వాత అభిమానులకు వచ్చిన అనుమానం ఇదే. లేకపోతే మరేంటి.. ఇష్క్, మనం, 24, హలో లాంటి సినిమాలు చేసిన ఈయన ఇప్పుడు గ్యాంగ్ లీడర్ అంటూ వచ్చాడు. టైటిల్ లోనే పవర్ ఉంది కానీ కథలో మాత్రం లేదంటూ పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు. మరీ ముఖ్యంగా విక్రమ్ కే కుమార్ సినిమాలను అభిమానించే వాళ్లకు మాత్రం గ్యాంగ్ లీడర్ తీవ్రంగా నిరాశ పరిచిందనే చెప్పాలి. ఎందుకంటే రొటీన్ కథలు తీసుకున్నా కూడా దానికి తన మార్క్ స్క్రీన్ ప్లే అద్ది ఔట్ స్టాండింగ్ అనిపిస్తాడు విక్రమ్. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ లో కూడా ఇదే చేస్తాడని అనుకున్నారు ఆడియన్స్. కానీ దీనికి పరమ రొటీన్ స్క్రీన్ ప్లే రాసుకుంటాడని మాత్రం ఎవరూ కనీసం ఊహించలేదు. లెక్కలేసుకుని తీసినట్లు.. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అంతా మన కళ్ల ముందు కనిపిస్తున్న క్షణాన విక్రమ్ కే కుమార్ స్క్రీన్ ప్లే మాత్రం పూర్తిగా తేలిపోయింది. దాంతో ఆడియన్స్ లో నిరాశ కూడా తప్పలేదు. ముఖ్యంగా విక్రమ్ లాంటి బ్రిలియంట్ దర్శకుడి నుంచి గ్యాంగ్ లీడర్ లాంటి రొటీన్ స్క్రీన్ ప్లే మాత్రం అస్సలు ఊహించలేదు. కమర్షియల్ గా ఈ చిత్రం వర్కవుట్ అవుతుందా లేదా అనేది పక్కనబెడితే కచ్చితంగా విక్రమ్ కే కుమార్ కెరీర్ లో తొలిసారి జోనర్ మార్చి.. రొటీన్ సినిమా చేసాడు. ఇది నిజంగానే ఆయన అభిమానులకు షాక్. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 29 కోట్లకు పైగానే వసూలు చేయాలి. ప్రస్తుతం వచ్చిన టాక్ చూస్తుంటే అంత తీసుకొస్తుందా అనేది చూడాలిక.

More Related Stories