English   

టాలీవుడ్ సరికొత్త సంచలనం ప్రియాంక అరుల్ మోహన్..

gl
2019-09-14 06:44:08

గ్యాంగ్ లీడర్ సినిమా చూసిన వాళ్లకు ఈ భామతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇన్ని రోజులు టీజర్స్, ట్రైలర్స్ లో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలో మరింతగా మాయ చేసింది. స్క్రీన్ పై చాలా ఫ్రెష్ గా కనిపిస్తూ.. అందమైన రూపం.. చక్కటి చూపులతో ఆకట్టుకుంది ప్రియాంక మోహన్. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో అయితే తనదైన నటనతో మాయ చేసింది ప్రియా. తొలి సినిమా అయినా కూడా ఎక్కడా ఆ భయం మాత్రం కనిపించలేదు. స్క్రీన్ పై ఎలాంటి బెరుకు లేకుండా నటించేసింది ప్రియాంక. కచ్చితంగా ఈ చిత్రం ఫలితంతో పనిలేకుండా అవకాశాల వేటలో దూసుకెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. గ్యాంగ్ లీడర్ విడుదల కావడంతో ఇప్పటికే కొందరు దర్శక నిర్మాతలు కూడా ఈమెకు అడ్వాన్సులు ఇవ్వడం మొదలపెట్టి ఉంటారు. అయినా నానికి తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లను పరిచయం చేయడం ఇదేం కొత్త కాదు. నివేదా థామస్, మెహ్రీన్ కౌర్, నిత్యామీనన్, శ్రద్ధా శ్రీనాథ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ముద్దుగుమ్మలు నాని సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పుడు ప్రియాంక మోహన్ కూడా ఇలాగే వచ్చింది. మరి ఈమె కూడా వాళ్ల మాదిరే మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటుందా లేదా అనేది ఇంకొన్ని రోజుల్లో తేలనుంది. ప్రస్తుతానికి అయితే ప్రియాంక మోహన్ గురించి ఇండస్ట్రీలో చాలా చర్చే జరుగుతుంది.

More Related Stories