English   

గోపీచంద్ మరో సినిమా మొదలు.. జోరుమీదున్న మాస్ హీరో..

gopichand
2019-09-14 06:58:54

యాక్షన్ హీరో గోపీంచ్ జోరు మీదున్నాడు. హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరస సినిమాలు చేస్తున్నాడు ఈయన. మొన్నటికి మొన్న సంపత్ నంది సినిమాను వర్కవుట్ చేసిన ఈయన.. ఇప్పుడు మరో సినిమాకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం చాణక్య సినిమాతో బిజీగా ఉన్నాడు గోపీచంద్. ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత ఇప్పుడు శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్.ఎల్‌.పి ప‌తాకంపై సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాణంలో గోపీ నటించబోతున్నాడు. సాహసం తర్వాత ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా ఇది. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలైంది కూడా. ఎలాంటి సందడి లేకుండా ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు నిర్మాతలు. ఈ సినిమాతో బిను సుబ్ర‌మ‌ణ్యం అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు.

ఈ సినిమాను ఇండియా స‌హా నేపాల్‌, కాంబోడియా, థాయ‌లాండ్‌లో చిత్రీకరించనున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి స‌తీశ్ కురుప్ కెమెరా వ‌ర్క్‌ను అందిస్తున్నారు. హీరోయిన్ పై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే దీనిపై వివరణ ఇవ్వనున్నారు దర్శక నిర్మాతలు.సాహ‌సంతో యావరేజ్ దగ్గరే ఆగిపోయిన గోపీచంద్, బి.వి.ఎస్‌.ఎన్ ప్ర‌సాద్ ఈ సారి బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నారు. గోపీచంద్ ఇమేజ్ కు తగ్గ కథతోనే ఇది రాబోతుందంటున్నాడు దర్శకుడు బిను సుబ్రమణ్యం.

More Related Stories