గోపిచంద్ రెండో కొడుకు బర్త్ డే...సందడి చేసిన స్టార్ లు

హీరో గోపిచంద్ ఇండస్ట్రీలోని అందరి హీరోలతో స్నేహంగా మెలుగుతాడన్న సంగతి తెలిసిందే. కెరీర్ మొదట్లో కలిసి నటించడంతో ప్రభాస్ తో కాస్త ఎక్కువ స్నేహం. ఇక అసలు విషయానికి గోపీ చంద్ 2013 మే నెలలో హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి 2014 అక్టోబర్లో మొదటి కుమారుడు జన్మించగా అతడికి గోపీచంద్ తండ్రి పేరు కలిసి వచ్చేలా విరాట్ కృష్ణ అని పేరు పెట్టారు. ఇక గత ఏడాది వినాయక చవితి రోజున మరో కుమారుడు కూడా పుట్టాడు. ఆ బుడతడికి వియాన్ అని పేరు పెట్టుకున్నారు గోపీ దంపతులు.
నిన్న వియాన్ మొదటి బర్త్డే సెలబ్రేషన్స్ హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. వారిద్దరితో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయినా వీరిద్దరూ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక శ్రీ వాస్ లౌక్యం సినిమా తరువాత గోపీచంద్ సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇక తజా పరిస్థితులలో లేటెస్ట్ గా నటిస్తున్న 'చాణక్య' మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా మరికొద్ది రోజులలో విడుదల కానుంది. ఇక బిను సుబ్రమణ్యం అనే కొత్త దర్శకుడి డైరెక్షన్లో నిన్ననే ఒక సినిమా ఓపెనింగ్ కూడా చేసుకున్నాడు గోపిచంద్.