English   

గోవాలో ప్యాకప్ చెప్పిన డిస్కో రాజా

raja
2019-09-15 21:53:28

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. క్షణం ఫేమ్ వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమాని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ మీద రామ్‌ తాళ్లూరి ఈ సినిమాని  నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ భామ నభా నటేశ్‌ ను ఒక హీరోయిన్ కాగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ మరో నాయికగా నటిస్తోంది. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుపుకుటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ గోవాలో జరుగుతున్న విషయం తెలిసిందే.

తాజాగా గోవా షెడ్యూల్‌ పూర్తయ్యిందని తెలియజేస్తూ గోవాలోని ఓ బీచ్‌లో ఇసుకతో ‘డిస్కోరాజా’ అని రాసి దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది సినిమా యూనిట్. రివేంజ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఈ మధ్య విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కొద్ది రోజులుగా చిత్రం గోవా షెడ్యూల్ జ‌రుపుకుంటుండ‌గా, రీసెంట్‌గా పూర్తైంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 20,2019న విడుద‌ల కానున్నట్టు చెబుతున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగవంతంగా పూర్తి చేసి అనుకున్న‌ టైంకి సినిమాని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

 

More Related Stories