English   

నాగ్ కి నొప్పులు తగ్గలేదట

Nagarjuna
2019-09-16 09:43:11

పల్లె, పట్టణం అన్న తేడాలేకుండా జనం జ్వరాల బారిన పడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికున్ గన్యా వంటి రకరకాల జ్వరాలతో... రోగులు ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. సినీ సెలెబ్రిటీలు సైతం అందుకు మినహాయింపు కాదు. ఆ మధ్య నాగార్జునకి అస్వస్థత అంటూ కొన్ని రోజులు ఒక వార్త హల్చల్ చేసింది. ఆయన దానికి అప్పుడు సమాధానం ఇవ్వలేదు కానీ, తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. అదేంటంటే తాను ఈ మధ్య వైరల్ ఫీవర్ తో  బాధ పడినట్టు అందులో పేర్కొన్నాడు. 

మురికి నీటి వల్ల దోమలు వ్యాప్తి చెందుతాయని జాగ్రత్తగా ఉండమని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడే వైరల్‌ ఫీవర్ నుండి కోలుకున్నానని, కానీ ఒళ్లు నొప్పులు మాత్రం విపరీతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఆపడానికి ఇల్లు, అన్నపూర్ణ స్టూడియోస్‌ పరిసరాల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూడమని మా వారితో చెప్పా. మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా. మీ ఇల్లు, పని చేస్తున్న ప్రదేశాల్లోని మురికి నీటిని తొలగించండి’ అని ట్వీట్ చేశారు నాగ్. అక్కడితో ఆగక ఆయన మంత్రి కేటీఆర్‌ను కూడా ట్యాగ్‌ చేశారు. దీంతో పాటు శుభ్రం చేస్తున్న కొన్ని ఫొటోలను కూడా షేర్‌ చేశారు. 
 

More Related Stories