English   

మంచు లక్ష్మి యాంకర్ గా మరో క్రేజీ షో

 Lakshmi Manchu
2019-09-16 14:37:30

మంచు లక్ష్మి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె సినిమాల ద్వారా పెద్ద పాపులారిటీ తెచ్చుకోలేకున్నా తన వెరైటీ తింగ్లీష్ తో జనాల్లో మంచి క్రేజ్ సంపాదించింది. ఆమె కొన్ని షోలు కూడా హోస్ట్ చేయగా అవి మంచి హిట్స్ గా నిలిచాయి. తాజాగా ఆమె మరో షోతో మనముందుకు రావడానికి సిద్దమయ్యింది. నిజానికి సినిమా నటులంటే ఇష్టపడని వారుండరు. సినిమాల్లో వాళ్లను చూసి అసలు వీరి దినచర్య ఎలా ఉంటుంది. లేవగానే ఏమి చేస్తారు ? పడుకునే ముందు ఏమి చేస్తారు అనే విషయాలంటే ఇంటరెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవడమే కాక ఇప్పటి వరకూ తెలియని విషయాలను కూడా తెలసుకోవాలనుకుని చాలా మంది ఆత్రుతగా ఉంటారు. అలాంటి వారికోసమే బాలీవుడ్ స్టార్స్ కోసం ఫుట్ అప్ విత్ స్టార్స్ అంటూ ఓ షో వస్తోంది. ఇలాంటి ఒక షోను తెలుగులోకి తెచ్చేందుకు సిద్దమయ్యింది లచ్చక్క. దాని పేరే బెడ్ టైం స్టోరీస్. వయాకామ్ 18 సంస్థ నిర్మిస్తోన్న ఈ షో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. గతంలో లక్ష్మి చేసిన మీ కోసం షో సూపర్ హిట్ కాగా ఈ షో కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.

More Related Stories