English   

సైరా కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నా నిర్మాత రామ్ చరణ్..

 Charan
2019-09-16 15:59:00

బాహుబలి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అంత భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాలు సాహో, సైరా. ఈ రెండు సినిమాలపై ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి ఉంది. ఇందులో సాహో విడుదలైంది. ఫలితం కూడా అందరికి తెలుసు. ఇక మిగిలిన సైరా అక్టోబర్ 2 న విడుదల కానుంది. ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టడంతో ఆ ప్రమోషన్స్ బాధ్యత కూడా చరణ్ తీసుకుంటున్నాడు. దీనికోసం ప్రత్యేకంగా ఇప్పుడు అయిన యాంకర్ అవతారం కూడా ఎతుతున్నాడు. సైరా కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నాడు. అది కూడా తానే హోస్ట్ గా మారి అందరినీ ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. సాధారణంగా ఎవరైనా బయట యాంకర్ పెట్టుకొని సినిమా విశేషాలను చెబుతూ ఉంటారు దర్శక నిర్మాతలు. కానీ ఇక్కడ మాత్రం సినిమా క్రేజ్ పెంచడానికి రామ్ చరణ్ స్వయంగా యాంకర్ గా మారుతున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేయనున్నారు రామ్ చరణ్. సైరా విడుదలకు మరో 15 రోజులు మాత్రమే ఉంది.దాంతో చేయాల్సిన పనులన్నీ వేగంగా పూర్తి చేస్తున్నాడు ఈయన.

ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న ఈ హీరో అక్కడి నుంచి కాస్త టైమ్ దొరికితే సైరాపై దృష్టి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం సైరా టీం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. దానికితోడు చిరంజీవి కూడా దీనిపై ఫోకస్ చేసాడు. ఈ సినిమాకు తెలుగులో కావాల్సినంత క్రేజ్ ఉంది.. ఎలాగో చిరంజీవి ఉన్నాడు.. దానికి తోడు రామ్ చరణ్ నిర్మాత కావడంతో సినిమా బిజినెస్ ఈజీగా 150 కోట్లకు పైగానే జరుగుతుంది. కానీ తమిళ హిందీ ఇండస్ట్రీలో మాత్రం బాహుబలితో సమానమైన క్రేజ్ మాత్రం సైరాకు లేదు. దాంతో అక్కడ తమ సినిమాను ఎలాగైనా నిలబెట్టాలని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాడు రామ్ చరణ్. హిందీలో అమితాబ్ బచ్చన్.. తమిళంలో నయనతార, విజయ్ సేతుపతి.. కన్నడలో సుదీప్.. ఇలా ఏ భాషలో ఉన్న హీరోలకు ఆ భాషలో అభిమానులు టార్గెట్ చేస్తూ స్పెషల్ ఇంటర్వ్యూలు చేయడానికి సిద్ధమవుతున్నాడు రామ్ చరణ్. అది కూడా తానే హోస్ట్ కావడంతో కచ్చితంగా సినిమాకు ప్రమోషన్ గా పనికి వస్తుందని ఆయన భావిస్తున్నాడు. మరి రామ్ చరణ్ వేసిన ప్లాన్ సైరాకు ఎంతవరకు పనికి వస్తుందనేది చూడాలి.

More Related Stories