English   

బాహుబలి కంటే సైరా ఎక్కువ.. రాజమౌళిని దాటిన సురేందర్ రెడ్డి..

sye raa
2019-09-16 16:33:48

తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలను సమూలంగా మార్చేసిన సినిమా బాహుబలి. ఈ చిత్రం వచ్చిన తర్వాతే టాలీవుడ్ గురించి అంతా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకురావడం.. ఇక్కడ వాళ్లను సరిగ్గా వాడుకోవడం ఇవన్నీ మనకు చూపించింది బాహుబలి సినిమానే. ఇప్పుడు సైరా కోసం కూడా ఇదే చేస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. సైరా కోసం హాలీవుడ్ నుంచి ప్రముఖులు వచ్చారు.. ఇక్కడ సినిమా కోసం పని చేసారు. మరో 15 రోజుల్లోనే విడుదల కానుంది సైరా. అయితే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓ విషయంలో మాత్రం బాహుబలిని సైరా వెనక్కి నెట్టేసింది. అదే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో. అవును.. నమ్మడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు సైరాలో బాహుబలి కంటే ఎక్కువ విఎఫ్ఎక్స్ షాట్స్ వాడారని తెలుస్తుంది. 2500 విఎఫ్ఎక్స్ షాట్స్ తో బాహుబలి వచ్చింది.. కానీ సైరాలో మాత్రం 3500 వరకు ఈ షాట్స్ ఉన్నాయి. అయితే బడ్జెట్ విషయంలో మాత్రం సైరా కంటే బాహుబలి చాలా ఎక్కువ. తక్కువ ఖర్చుతో ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ చూపించడం సైరాలో అభినందనీయం. 2.0 కోసం కోట్లు ఖర్చు చేసినా కూడా ఔట్ పుట్ మాత్రం సరిగ్గా రాలేదు. దాంతో విమర్శలు తప్పలేదు. అందుకే ఇప్పుడు సైరా కోసం తక్కువ ఖర్చుతో క్వాలిటీ ఔట్ పుట్ ప్లాన్ చేసాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. మరి చూడాలిక.. ఈ చిత్రంలో ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయో..?

More Related Stories