షాకింగ్ లుక్ లో సీనియర్ హీరోయిన్ !

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది సిమ్రాన్. వయసు రీత్యా ఆమెకు ఆఫర్స్ రాక సైలెంట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ తల్లి పాత్రలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. నిజానికి తెలుగులో హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలో తెలుగులో ఉన్న అగ్ర హీరోలందరితోనూ ఆమె నటించింది. ఒక్క తెలుగు వరకే కాక పలు దక్షిణాది చిత్రాల్లోనూ సిమ్రాన్ నటించగా అందులో ఎన్నో సినిమాలు సూపర్ హిట్ కూడా అయ్యాయి. అయితే ఆమె తాజాగా పోస్ట్ చేసిన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దానికి కారణం ఆమె ఇప్పుడు కనపడుతున్న వైనం. ఒకప్పుడు ఆమె ఎంత గ్లామరస్‌గా ఉండేదో ఇప్పుడు అందుకు ఆమె పూర్తి భిన్నంగా మారిపోయింది. ఒకప్పుడు గ్లామర్‌కి కేరాఫ్‌గా నిలిచిన సిమ్రాన్ ఇప్పుడు ఇలా ఉందేమిటా ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇప్పుడు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తోంది. గత ఏడాది కొత్తలో ఆమె రజినీకాంత్ పెట్ట సినిమాలో నటించగా ఇప్పుడు రాకెట్రీ, షుగర్ అనే మరో రెండు తమిళ సినిమాల్లో నటిస్తోంది.