English   

విజయ్ దేవరకొండ బ్రేకప్.. ఎవరితో తెలుసా..

vijay
2019-09-16 21:33:02

అవును.. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు నిజంగానే విజయ్ బ్రేకప్ చెప్పేసాడు. ఈయన ఎవరితో ప్రేమలో ఉన్నాడు బ్రేకప్ చెప్పడానికి అనుకుంటున్నారా..? ఇంత క్రేజీ హీరోకు లవ్ ఎఫైర్లు లేకుండా ఉంటాయా అనుకుంటున్నారు కదా.. మీరు ఊహించింది నిజమే.. ఆయన బ్రేకప్ చెప్పింది కూడా నిజమే. కాకపోతే ఇదంతా సినిమా కోసమే. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇమేజ్ రోజుకో మాదిరి మారుతుంది. మొన్నటి వరకు ఈయనతో సినిమా అంటే సంచలనమే. కానీ డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత ఈయన కూడా అందరిలాంటి హీరో అయిపోయాడు. గీత‌ గోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాల తర్వాత మనోడి రేంజ్ మారిపోయింది. కానీ డియర్ కామ్రేడ్ తో మరోసారి ఫ్లాప్ రుచి చూసాడు విజయ్. అయినా కూడా ఈయన క్రేజ్ అలాగే ఉంది. ప్రస్తుతం ఈ హీరో క్రాంతిమాధ‌వ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

దీనికి బ్రేకప్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు. వరల్డ్ ఫేమస్ లవర్ అనేది ట్యాగ్ లైన్. ఓనమాలు తర్వాత మళ్లీ మళ్లీ ఇది రానిరోజు లాంటి సినిమా చేసిన క్రాంతి.. ఉంగ‌రాల రాంబాబుతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు విజ‌య్ ఉన్న పొజిష‌న్ ప్ల‌స్ క్రేజ్ ను క్రాంతి ఎంత‌వ‌ర‌కు హ్యాండిల్ చేస్తాడు అనేది అంద‌ర్లోనూ ఉన్న అనుమానం. అయితే ఇక్క‌డ మ‌రో అడ్వాంటేజ్ కూడా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ద‌ర్శ‌కుల‌ను రెస్పెక్ట్ చేయ‌డం బాగా తెలుసు. క‌థ డిమాండ్ చేస్తే కాళ్లు ప‌ట్టుకోడానికి కూడా సిద్ధంగానే ఉంటాడు ఈ హీరో. గీత‌ గోవిందంలో కూడా ఇదే చేస్తాడు విజ‌య్. హీరో వ‌ర్షిప్ కంటే కూడా న‌టుడిగా ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌తాడు విజ‌య్. క్రాంతి సినిమాలో కూడా ఇదే ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, కేథరిన్ థ్రెసా, ఎజిబెల్లా, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అందుకే సినిమాకు బ్రేకప్ అనే టైటిల్ పెట్టారు. క్రియేటివ్ కమర్షియల్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Related Stories