English   

చిరంజీవి సైరా డబ్బుల కోసమా.. అవార్డుల కోసమా..?

syeraa1
2019-09-16 21:56:40

చిరంజీవి అంటే కమర్షియల్ హీరో.. ఆయన సినిమా చేస్తే రికార్డులు బద్దలైపోతాయి. మాస్ అనే పదానికి ఆయన నిదర్శనం. ఒకప్పుడు మెగాస్టార్ సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ బద్ధలవడం ఖాయం. ఖైదీ నెం 150 సినిమాతో కూడా పదేళ్ల తర్వాత వచ్చి సంచలన విజయం అందుకున్నాడు మెగాస్టార్. ఇప్పుడు సైరా నరసింహా రెడ్డితో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు చిరంజీవి. అక్టోబర్ 2న విడుదల కానుంది ఈ చిత్రం. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని 250 కోట్లతో నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే బిజినెస్ మాత్రం దర్శక నిర్మాతలు ఊహించిన స్థాయిలో జరగడం లేదని తెలుస్తుంది. హిందీలో సైరా బిజినెస్ మరీ తక్కువగా జరుగుతుండటంతో అసలు ఈ చిత్రం తీస్తుంది అవార్డుల కోసమా..

కలెక్షన్ల కోసమా అని అనుమానాలు వస్తున్నాయి. తెలుగులో కూడా ఈ చిత్రం బిజినెస్ ఆశాజనకంగా లేదనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 130 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని రామ్ చరణ్ నమ్మకంగా కనిపిస్తున్నాడు.. కానీ అంత జరగడం లేదు అనేది మాత్రం పైకి కనిపిస్తున్న నిజం. ఇక తమిళ, మళయాల, కన్నడ ఇండస్ట్రీల్లో పరిస్థితి అలాగే ఉంది. దాంతో ఇప్పుడు సైరా సినిమా నిజంగానే కలెక్షన్ల కోసమే తీస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. గతంలో చిరంజీవి నటించిన అవార్డు విన్నింగ్ సినిమాలు రుద్రవీణ, స్వయంకృషి, ఆపద్భాందవుడు పేరు తీసుకొచ్చినా డబ్బులు తీసుకురాలేదు. మరిప్పుడు సైరా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

More Related Stories