English   

ఆ సినిమాకి గ్యాప్ తప్పదు

alluarjunlatest.jpg
2019-09-17 06:59:00

చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ వరుస సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం  త్రివిక్రమ్‌ సినిమాతో పాటు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఐకాన్‌, సుకుమార్‌ డైరక్షన్‌ లో సినిమా ఇలా వరుసగా ఒకేసారి అనౌన్స్‌ చేశాడు. ఏడాది గ్యాప్ తీసుకుని మరీ వరసగా మూడు సినిమాలను లైన్లో పెట్టాలని పెద్ద స్కెచ్‌ వేశాడు. కానీ అది ఇపుడు వర్కవుట్‌ అయ్యేలా కనిపించడం లేదు.

ఎందుకంటే ముందు త్రివిక్రమ్‌ సినిమా పూర్తి చేయాలి. తర్వాత సుక్కూ సినిమా మొదలుపెట్టాలి. తన సినిమా మొదలుపెట్టకుండా మరోటి ఓకే చేసేందుకు సుకుమార్‌ ఒప్పుకోవడం లేదట. దీంతో సుకుమార్‌ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెలల్లో లాంచ్‌ చేయాలని భావిస్తున్నాడు బన్నీ. ఈ ప్రకారం చూస్తే ఐకాన్‌ సినిమా ఇపుడు షూటింగ్‌ కుదరదు. ఈ విషయాన్ని దిల్‌రాజుకి, వేణు శ్రీరామ్‌కి చెప్పాడత బన్నీ. సో ఈ విషయంలో బన్నీ ఫయాన్స్ ఇబ్బంది పడక తప్పదనేది ఫిలిం నగర్ వర్గాల టాక్.

More Related Stories