నేనే వరల్డ్ ఫేమస్ లవర్ ..విజయ్ దేవరకొండ..

అవును.. ఇప్పుడు విజయ్ ఇదే అంటున్నాడు. ప్రేమలో తనను మించిన వాళ్లు లేరంటున్నాడు ఈయన. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న సినిమాకు వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. విజయ్ దేవరకొండ ఇమేజ్ రోజుకో మాదిరి మారుతుంది. మొన్నటి వరకు ఈయనతో సినిమా అంటే సంచలనమే. కానీ డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత ఈయన కూడా అందరిలాంటి హీరో అయిపోయాడు.
గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాల తర్వాత మనోడి రేంజ్ మారిపోయింది. కానీ డియర్ కామ్రేడ్ తో మరోసారి ఫ్లాప్ రుచి చూసాడు విజయ్. అయినా కూడా ఈయన క్రేజ్ అలాగే ఉంది. ప్రస్తుతం ఈ హీరో క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దీనికి వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ ఖరారు చేసారు. తాజాగా టైటిల్ లోగో కూడా విడుదల చేసారు. ఓనమాలు తర్వాత మళ్లీ మళ్లీ ఇది రానిరోజు లాంటి సినిమా చేసిన క్రాంతి.. ఉంగరాల రాంబాబుతో డిజాస్టర్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ ఉన్న పొజిషన్ ప్లస్ క్రేజ్ ను క్రాంతి ఎంతవరకు హ్యాండిల్ చేస్తాడు అనేది అందర్లోనూ ఉన్న అనుమానం.
అయితే ఇక్కడ మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. విజయ్ దేవరకొండకు దర్శకులను రెస్పెక్ట్ చేయడం బాగా తెలుసు. కథ డిమాండ్ చేస్తే కాళ్లు పట్టుకోడానికి కూడా సిద్ధంగానే ఉంటాడు ఈ హీరో. గీత గోవిందంలో కూడా ఇదే చేస్తాడు విజయ్. హీరో వర్షిప్ కంటే కూడా నటుడిగా ఉండటానికి ఇష్టపడతాడు విజయ్. క్రాంతి సినిమాలో కూడా ఇదే ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, కేథరిన్ థ్రెసా, ఎజిబెల్లా, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అందుకే సినిమాకు వలర్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ పెట్టారు. క్రియేటివ్ కమర్షియల్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.