సింహా సినిమాకి స్ఫూర్తి ఆయనేనట !

లక్ష్మీనరసింహ సినిమా హిట్ తర్వాత బాలయ్య చేసిన ప్రతీ సినిమా ఫ్లాపే. ఒకరకంగా బాలయ్య సినిమా అంటే కన్ఫాం ఫ్లాప్ అనే భావనకి వచ్చేశారు ప్రేక్షకులు. ఇక బాలకృష్ణ పని అయిపోందన్నారందరూ. సరిగ్గా ఆ టైమ్‌లోనే దర్శకుడిగా రెండు సినిమాల అనుభవం ఉన్న బోయపాటి లైన్లోకి వచ్చాడు. బాబూ రెడీ బాబూ అంటూ ఒక మాస్ యాక్షన్ కధతో సినిమా చేశాడు. సింహాని నటసింహంతో నటింపచేసి 2010 ఏప్రిల్ 30న రిలీజ్ చేశాడు. బెన్ఫిట్ షో నుండీ ఒకటే టాక్ నటసింహ ఈజ్ బ్యాక్ విత్ సింహా అని. సింహాగా బాక్సాఫీస్ దగ్గర జూలు విదిల్చాడు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఈ సినిమాతో అప్పటి వరకు ఎవరూ చూడని సరికొత్త బాలయ్యని, రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో చూపించి బోయపాటి శభాష్ అనిపించుకున్నాడు. అప్పటినుండి బాలయ్య అభిమానులకు అభిమాన దర్శకుడయ్యాడు. బాలయ్య ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, చక్రి గమ్మతైన సాంగ్స్, చిన్నా ఆర్ఆర్, ఆర్థర్ ఎ.విల్సన్ ఫోటోగ్రఫీ సినిమాని ఒక లెవల్‌కి తీసుకెళ్ళాయి.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఇలా ఒక్కరరేమి సినిమా కోసం పని చేసిన వారందరూ లాభాలు చవిచూసారు. అయితే ఈ సినిమా ఎవరి స్ఫూర్తితో తీశారో తెలుసా ? నిన్న చనిపోయిన ఏపీ మాజీ స్పీకర్ కోడెల జీవిత స్ఫూర్తితో. నిజానికి సింహా సినిమా సంచలన విజయం సాధించడంతో దాని విజయోత్సవ వేడుకలకు ప్రొద్దుటూరు అభిమానులు ఏర్పాటు చేసుకుని దర్శకులు బోయపాటి శీనుని ఆహ్వానించటం జరిగింది. ఆ కార్యక్రమానికి బోయపాటి గారితో హైదరాబాద్ నుండి కొందరు బాలయ్య అభిమాలు బస్ లో వెళ్లటం జరిగింది. ఆ ప్రయాణంలో సింహా సినిమా గురించి బోయపాటి చెప్పిన మాట సింహా సినిమా కి స్ఫూర్తి కోడెల గారు అని. ప్రజలకి ప్రాణం పొయ్యాల్సిన వైద్య వృత్తి నుంచి ఆ ప్రజలకు అండగా నిలబడటానికి ఆపన్నులకి అండగా నిలబడిన కోడెల ఆ సినిమాకి స్ఫూర్తి అవ్వటం అనే లాజిక్ ఎవరూ ఊహించనిది. నిజమే సినిమాలో బాలయ్య కూడా ఒక పక్క వైద్యం మరో పక్క జనోద్దరణ చేస్తూ ఉంటాడు.