English   

సాహో నుంచి దేవీ శ్రీ ప్రసాద్ తప్పించుకున్నాడా.. 

saaho
2019-09-17 17:01:24

సాహో సినిమా విడుదలైన తర్వాత అందులో ఎన్ని మైనస్ లు ఉన్నాయో అంతా కూర్చుని చర్చించారు. మూడేళ్లు తెరకెక్కించాడు కాబట్టి సుజీత్ కు ఇది నమ్మడానికి కాస్త కష్టమే కావచ్చు కానీ సినిమా చాలా చోట్ల ఫ్లాప్ అయిందనేది మాత్రం ఒప్పుకుని తీరాల్సిన నిజం. బాలీవుడ్ లో మాత్రమే సాహో హిట్.. ఇక ఈ సినిమా మొదలైన తర్వాత ప్రయాణం కూడా సాఫీగా సాగలేదు. ముఖ్యంగా సంగీత దర్శకుల విషయంలో కూడా ముందు నుంచి కన్ఫ్యూజన్ ఉంది. శంకర్ ఇషాన్ లాయ్ ఈ సినిమాకు పాటలు అందించాలనుకున్నా.. చివర్లో చేతులెత్తేసారు. దాంతో సినిమాలోని నాలుగు పాటలను నలుగురు సంగీత దర్శకులతో కంపోజ్ చేయించారు. ఇక ఈ చిత్రంలో ఐదో పాట కూడా ఉంది. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసాడని తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ గా ఈ పాటను పెడదామని భావించినా.. అప్పటికే లెంత్ ఎక్కవైపోవడం.. అసందర్భంగా పాట వస్తే ఎక్కడ ప్రేక్షకులు డిస్ కనెక్ట్ అయిపోతారో అని భయపడి దాన్ని తీసేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు.. దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్ కూడా ప్రభాస్ కు పెద్దగా నచ్చేలేదనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏదేమైనా కూడా సాహో ఫెయిల్యూర్ కు దేవీ ఓ కారణం కాకుండా తప్పించుకున్నాడు. ఒకవేళ సినిమాలో దేవీ పాట ఉండి దానికి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చుంటే కచ్చితంగా ఆ భారం దేవీ శ్రీ ప్రసాద్ కూడా మోయాల్సిన పరిస్థితి వచ్చుండేది. 

More Related Stories