రాజమండ్రి సెంట్రల్ జైల్లో భారతీయుడు

దాదాపు పాతికేళ్ళ క్రితం వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో మనకి తెలియనిది కాదు. ఈ సినిమా శంకర్ కి డైరెక్టర్ గా ఎంత మంచి పెటు తెచ్చిపెట్టిందో కమల్ కి అంత పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేసిన శంకర్ భారతీయుడు-2 టైటిల్ తో సినిమా అనౌన్స్ చేయగా ఆ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్లాన్ చేసింది మూవీ యూనిట్ చిత్ర బృందం.
ఈ రెండో షెడ్యూల్ కమల్ తో పాటు సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న నటీనటులందరూ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 19 నుంచి అంటే రేపటి నుండి రాజమండ్రి జైల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని చెబుతున్నారు. ఇక్కడ షూటింగ్ పూర్తయితే తరువాతి షెడ్యూల్ కోసం యూనిట్ అంతా విదేశాలకు పయనమయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా లైన్ అంతా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల మీదే ఉండనుందని అంటున్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. రత్నవేలు కెమెరామేన్‌గా ఉండగా అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.